సంక్రాంతి పండుగ వస్తోంది. ఈ నేపథ్యంలో పాఠశాలలు అలాగే కాలేజీలకు హాలిడేస్ ప్రకటించారు. ఉద్యోగం చేసుకునే వారు కూడా వారం రోజులపాటు సెలవులు తీసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలామంది… తమ సొంత ఊర్లకు… వెళ్లేందుకు ప్రయాణిస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరం మొత్తం ఖాళీ అవుతోంది. తెలంగాణలో ఎక్కువ శాతం ఏపీ జనాలు ఉండడంతో… వారంతా తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలోనే విజయవాడ వెళ్లి హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు కూకట్పల్లిలో చాలామంది ప్రయాణికులు బస్టాపుల్లో నిలుచున్నారు. తమ బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు.. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇటు తెలంగాణ ప్రజలు కూడా హైదరాబాద్ నుంచి తమ సొంత ఊర్లకు వెళ్తున్నారు. దీంతో జూబ్లీ బస్టాండ్ కూడా కిటకిటలాడుతోంది.