శరీర బరువును తగ్గించడం అనేది అంత సులువు కాదు. బరువు తగ్గేందుకు ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొంతమంది ఆహారంలో మార్పులు చేస్తారు, ఇంకొంతమంది ఒక పూట భోజనాన్ని తగ్గిస్తారు, మరికొందరు వ్యాయామం ఎక్కువగా చేస్తారు.
కొన్ని కొన్ని సార్లు ఎన్ని చేసినా శరీర బరువు కొందరిలో తగ్గదు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. అందులో మీరు భోజనం తినే వేళలు కూడా కారణం కావచ్చు.
అవును.. సరైన వేళలో భోజనం తినకపోతే బరువు తగ్గలేరు. అందువల్ల ఏ సమయంలో భోజనం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా చేయాలి. ఉదయం 9:00 లోపు బ్రేక్ ఫాస్ట్ పూర్తయితే మరీ మంచిది. ఈ సమయంలో మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువ కాకుండా మామూలుగా తినాలని సలహా.
మధ్యాహ్నం పూట కావలసినంత తినవచ్చు. ఇది కూడా మధ్యాహ్నం రెండు లోపు తినేసేయాలి. ఇక్కడ ఉదయం కంటే కాస్త ఎక్కువగా తినవచ్చు. మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వరకు మళ్లీ నోటికి పని చెప్పకపోవడం మంచిది.
సాయంత్రం 6, 7 గంటల ప్రాంతంలో డిన్నర్ చేసేయడం ఉత్తమం. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎక్కువ క్యాలరీలు గల ఆహారాలను తినకుండా చూసుకోవాలి.
బరువు తగ్గాలనుకునేవారు ఈ విధంగా ట్రై చేస్తే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది.
దీనితోపాటు కావలసినన్ని నీళ్లు తాగడం, కావలసినంత నిద్రపోవడం మర్చిపోకూడదు.