మీ దగ్గర ఏటీఎం , డెబిట్ కార్డులు చాల కాలంగా వాడకుండా ఉన్నాయా …?

-

ఈ రోజుల్లో బ్యాంకు ఎకౌంటు లేని వారు ఎవరూ ఉండరు. కనుక ఎటీయం , డెబిట్ కార్డుల గురించి తెలుసుకోవాలిసిందే. రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా కొత్త గా తిసుకువచ్చిన నిర్ణయము ఏమిటో తెలుసుకోవాలి.మన ఫోన్ లాగానే కార్డులకు కూడా స్విచ్ ఆఫ్, ఆన్ సదుపాయం తీసుకు వచ్చారు.వివరాల్లోకి వెళితే జనవరి 15 వ తేదిన విడుదల చేసిన నోటిఫికేషన్ లో వివరించిన దాన్ని బట్టి ఇప్పటి వరకు ఒక్క సారి కూడా వాడకుండా వున్న కార్డలు మార్చి 16 తరువాత శాశ్వతంగా బ్లాక్ అయిపోతాయి అని వెల్లడించింది.

మీ ఎటీయం ద్వార జరిగే అన్ని రకాల ఆన్లైన్ సేవలు నిలిచిపోతాయి. భవిష్యత్తులో మీ కార్డు ద్వారా ఆన్లైన్ ,కాంటాక్ట్ లెస్ సేవలు పొందాలనుకుంటే మార్చి 16 లోగా మీ ఎటీయం కార్డ్ ని కనీసం ఒక్కసారైనా ఉపయోగించాలి. ఇది ఎటీయం, డెబిట్ కార్డ్లకే కాదు క్రెడిట్ కార్డ్లకు కూడా వర్తిస్తుంది.ఆర్బిఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కార్డుల మోసాలకు, దొంగతనాలకు చెక్ పడుతుంది. ఎటీయం, డెబిట్, క్రెడిట్ కార్డుల సెక్యూరిటీలు పెంచేందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకుంది.

ఖాతాదారులకు వారి ఖాతాలను అవసరం ఉన్నప్పుడు స్విచ్ఆన్, అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకునే సదుపాయం కల్పించాలని బ్యాంకులను కోరింది.అంటే ఓ రెండు నెలల పాటు మీ కార్డుని వాడకపోతే స్విచ్ ఆఫ్ చేయొచ్చు. దీని వాల్ల ఒక వేళ మీ కార్డు పోయినా ఆన్లైన్ ద్వారా ఉపయోగించలేరు. ఇప్పటికే కొన్ని బ్యాంక్లు ఈ సదుపాయాన్ని కలిపిస్తున్నాయి. త్వరలో అన్ని బ్యాంకులలోను ఈ వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news