40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కి రాజకీయంగా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు వైయస్ జగన్. 2019 ఎన్నికల్లో దాదాపు టిడిపి పార్టీ పునాదులు కదిలిపోయేలా విజయం సాధించిన జగన్ ఆ తర్వాత వరుసపెట్టి చంద్రబాబుకి షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాడు. ఎక్కడా కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా పరిపాలన చేస్తూ మరోపక్క తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలక నాయకులను రాజకీయంగా దెబ్బ కొడుతున్నాడు.ఇటువంటి తరుణంలో వైయస్ జగన్ 3 రాజధానులు తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు శాసనమండలిలో అడ్డుకుని కీలకమైన సమయంలో జగన్ కి అదిరిపోయే షాక్ ఇచ్చారు. అయితే ఈ విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా జగన్ తీసుకోవడంతో అసెంబ్లీలో అమలు అయ్యే ప్రతి నిర్ణయానికి అడ్డుపడుతున్న శాసనమండలిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లును సిఫార్సు చేయడం జరిగింది. అయితే శాసన మండలి రద్దు విషయంలో భిన్నాభిప్రాయాలు రావటం జరిగాయి.
శాసనమండలిని ఎవరూ అడ్డుకోలేరు మరియు రద్దు చేయలేరు అది చాలా పెద్ద ప్రాసెస్ అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విషయంపై కామెంట్ చేయడం జరిగింది. ఇటువంటి సమయంలో స్థానిక సంస్థలు ఎన్నికలు స్టార్ట్ అవ్వక ముందే కేంద్ర ప్రభుత్వం శాసనమండలిలో త్వరలోనే రద్దు చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదొక్కటే కాకుండా ఏపీ కి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులు అమలు చేయడానికి కేంద్రం రెడీ అవుతున్నట్లు సమాచారం.