మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్నారా…? మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఖాతా ఉందా..? అయితే మీరు క్షణాల్లో లోన్ తీసుకోవచ్చు. ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పైగా దీనిని చాలా ఈజీగా పొందవచ్చు. అది ఎలా అంటే..? కేవలం మిస్డ్ కాల్ ఇచ్చి లోన్ పొందొచ్చు. ఇక దాని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… దేశీ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్ల కోసం ఎన్నో రకాల సర్వీసులు అందిస్తున్న సంగతి తెలిసినదే. అయితే వీటిల్లో బ్యాంక్ రుణాలు కూడా ఒక భాగమని చెప్పొచ్చు.
పైగా తక్కువ డాక్యుమెంట్లతోనే పని పూర్తవుతుంది. ఇది ఇలా ఉండగా వడ్డీ రేటు కూడా తక్కువ గానే ఉంటుంది. వడ్డీ రేటు 9.6 శాతం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇతర బ్యాంకుల కన్నా ఇది తక్కువ వడ్డీ అని చెప్పుకోవచ్చు. అలానే ఈ లోన్ పొందాలంటే నెలకు కనీసం రూ.15 వేల వేతనం వస్తుండాలి.