SBI: హౌసింగ్ లోన్ తీసుకోవాలనే వాళ్ళకి సూపర్ ఛాన్స్…!

-

మీరు సొంతింటి కల సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా…? అయితే మీరు ఖచ్చితంగా ఎస్బీఐ అందించే ఈ ఆఫర్ ని చూడాల్సిందే..! గృహ రుణం తీసుకోవాలనుకుంటున్న వాళ్లకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ శుభవార్త చెప్పింది. అయితే గృహ రుణంపై వడ్డీ రేట్లను ఏకంగా 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. కనీస వడ్డీ రేటు 6.70 నుంచి స్టార్ట్ అవుతుంది అని స్టేట్ బ్యాంక్ చెప్పింది.

సిబిల్ స్కోర్ ఆధారంగా ఈ వడ్డీ రేట్లు ఖరారు అవుతాయి గమనించండి. ఇది ఇలా ఉండగా ఫ్రాసెసింగ్ ఫీజు రద్దు కూడా కొనసాగుతుందని స్టేట్ బ్యాంక్ వెల్లడించింది. హౌసింగ్ లోన్ తీసుకునే వాళ్ళు మార్చి 31 లోగా తీసుకుంటే మంచిది. అప్పటి వరకే ఈ అవకాశం ఉంటుంది. కస్టమర్ల సిబిల్ స్కోర్, తీసుకోబోతున్న రుణ మొత్తం ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయిస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ అంది.

సమాయానికి చెల్లింపులు చేసే కస్టమర్లకు తక్కువ వడ్డీకే రుణాలు అందించడమే లక్ష్యం అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన లో తెలిపింది. ఎస్బీఐ 75 లక్షల లోపు రుణాలను 6.7 కసీన వడ్డీ రేటు తో ఇవగ్గా… కనీస వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. ఒకవేళ కనుక యోనో యాప్ ద్వారా గృహ రుణాలు పొందితే మరో ఐదు బేసిస్ పాయింట్ల మేరు వడ్డీ రేటు తగ్గుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news