ఆర్ ఎక్స్ 100 హిందీ టైటిల్ చూసారా..?

Join Our Community
follow manalokam on social media

తెలుగులో సంచలన విజయం సాధించిన ఆర్ ఎక్స్ 100 సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిన్న సినిమాగా విడుదలై తిరుగులేని విజయాన్ని అందుకుని, హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, దర్శకుడు అజయ్ భూపతిలని ఒక్కరోజులో స్టార్లని చేసేసింది. ప్రస్తుతం ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతుంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. థడప్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్ శెట్టి కొడుకు అహన్ శెట్టి హీరోగా చేస్తున్నాడు.

హీరోయిన్ గా తారా సుతారియా నటిస్తుండగా ప్రీతమ్ స్వరాలు సమకూరుస్తున్నాడు. తెలుగులో మాదిరిగానే హిందీ టైటిల్ కి ఎరుపు కలర్ అద్దారు. ఒక నమ్మశక్యం కాని ప్రేమకథ అని ఉపశీర్షికని ఇచ్చారు. మిలన్ లుథ్రియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్ధం అవుతుంది. మరి తెలుగులో సంచలన విజయం అందుకున్న ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...