ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. త్వరలో కొత్త రూల్స్..!

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకి అలెర్ట్. త్వరలో కొత్త రూల్స్ రానున్నట్టు దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఎస్‌బీఐ పలు రూల్స్ మార్చేసింది. కొత్త రూల్స్ జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి అని చెప్పింది.

ఎస్‌బీఐ/ sbi

ఈ కొత్త రూల్స్ వలన కస్టమర్ల పై ప్రభావం పడనుంది. ఇక కొత్త రూల్స్ ఎలా ఉంటాయి..?, ఈ విషయాల్లో మార్పులు వచ్చాయి అనేది చూస్తే.. ఎస్‌బీఐ బీఎస్‌బీడీ అకౌంట్ నిబంధనలను సవరించింది. ఇవి జీరో బ్యాలెన్స్ అకౌంట్లు.

ఇందులో మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన పని లేదు. పేదల కోసం బ్యాంక్ ఈ తరహా అకౌంట్లను కూడా తీసుకొచ్చింది. దీనితో ఖాతా తెరిస్తే ఉచితంగానే ఏటీఎం కార్డు కూడా పొందొచ్చు అని ఎస్బీఐ వెల్లడించింది.

ఇది ఇలా ఉంటే ఏటీఎం నుంచి నెలవారీ లిమిట్ దాటిన తర్వాత డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే రూ.15 చార్జీ పడుతుంది. దీనికి జీఎస్‌టీ అదనం. ఒక వేళ కనుక లిమిట్ దాటితే ప్రతి లావాదేవీకి ఇదే చార్జీ వర్తిస్తుంది.

చార్జెస్ పడకుండా నెలకి 4 సార్లు చార్జీలు లేకుండా డబ్బులు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒక వేళ అవి దాటితే తర్వాత రూ.15కు జీఎస్‌టీ కలుపుకొని చార్జీలు చెల్లించుకోవాలి అని ఎస్బీఐ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news