ఎస్‌బీఐ లో మీకు ఖాతా వుందా..? అయితే కొత్త రూల్స్ తప్పక తెలుసుకోవాలి..!

మీకు దేశీ అతిపెద్ద బ్యాంక్ (ఎస్‌బీఐ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉందా..? అయితే ఈ విషయాలని మీరు తప్పక తెలుసుకోవాలి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 1 నుంచి కొత్త రూల్స్ ని తీసుకు రాబోతోంది.

ఈ కొత్త రూల్స్ వలన చాలా మంది పై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ అకౌంట్ సర్వీస్‌ చార్జీలను సవరించింది ఎస్బీఐ. బ్యాంక్ క్యాష్ విత్‌డ్రాయెల్స్, ఏటీఎం ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్, చెక్ బుక్, ట్రాన్స్‌ఫర్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు సవరించిన కొత్త సర్వీస్ చార్జీలు జూలై 1 నుంచి వర్తిస్తాయని ఎస్‌బీఐ వెల్లడించింది.

ఇది ఇలా ఉంటే బీఎస్‌బీడీ బ్యాంక్ ఖాతాల సవరించిన చార్జీలు ఎలా ఉన్నాయనేది చూస్తే.. బ్యాంక్ బ్రాంచ్ లేదా ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్ నెలలో నాలుగు ఉచిత క్యాష్ విత్‌డ్రాయెల్స్ పరిమితి అయిపోయిన తర్వాత ఒక్కో లావాదేవీకి రూ.15 చార్జీ పడుతుంది. జీఎస్‌టీ అదనం. ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ లీవ్స్‌ను ఉచితంగా అందిస్తుంది బీఎస్‌బీఐ.

వీటి తర్వాత 10 చెక్ లీవ్స్‌కు రూ.40 చార్జీ పడుతుంది. జీఎస్‌టీ అదనం. 25 చెక్ లీవ్స్‌కు అయితే రూ.75 చార్జీ, జీఎస్‌టీ చెల్లించాలి. ఇది ఇలా ఉండగా ఎమర్జెన్సీ చెక్ బుక్ (10 చెక్ లీవ్స్) కోసం అయితే రూ.50 చార్జీతో పాటు జీఎస్‌టీ కూడా ఉంటుంది.