తెలంగాణ హైకోర్టు చిరకాల కోరికను తీర్చిన సీజేఐ ఎన్వీ రమణ

-

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్య పెంచుతూ ఆయన చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఎంతో కాలంగా సుప్రీం కోర్టుకు విజ్ఞప్తులకు తాజాగా పరిష్కారం లభించినట్లు అయింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తాజా నిర్ణయంతో 24 మంది జడ్జీల సంఖ్య నుంచి 42కు పెరగనుంది. అటు న్యాయమూర్తుల సంఖ్య ఏకంగా 75 శాతానికి పెంచారు జస్టిస్‌ ఎన్వీ రమణ. అంతేకాదు.. తాజా నిర్ణయం తో 32 మంది శాశ్వత జడ్జీలు కాగా, 10 మంది అదనపు జడ్జీలు కానున్నారు.

హై కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం వెల్లడించింది. రెండేళ్లుగా మూలనపడిన హైకోర్టు విజ్ఞప్తిని వెలికితీసి తాజాగా సీజేఐ ఎన్వీ రమణ ఆమోదం తెలిపారు. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని గతంలో ప్రధాని, న్యాయ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news