గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటే ఎస్బీఐ సూపర్ ఆఫర్స్ ని చూడండి…!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి అనేక రకాల ఆఫర్స్ ని తీసుకు వస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా మరో సూపర్ ఆఫర్ ని తీసుకు రావడం జరిగింది. బంగారం పై లోన్ తీసుకునే వారికి ఎస్బీఐ అదిరిపోయే బెనిఫిట్స్ ని కలిపిస్తోంది. గోల్డ్ లోన్ తీసుకోవాలి అనుకునే వాళ్లకి ఇది గుడ్ న్యూస్ అనే అనాలి. గోల్డ్ లోన్ తీసుకుంటే అదిరిపోయే లాభాలు కలుగుతాయి. అయితే గోల్డ్ లోన్ ఎలా తీసుకోవాలి..?, ఎంత వడ్డీ రేటు ఉంది వంటి విషయాలు చూద్దాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో బంగారం పై లోన్ తీసుకోవాలి అంటే కేవలం ఒకే ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. గోల్డ్ లోన్ కావాలనుకుంటే 7208933143 నంబరుకు మిస్ట్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంక్ అధికారులు తిరిగి మీకు ఫోన్ చేస్తారు. ఆ తర్వాతా మీరు గోల్డ్ లోన్ పొందవచ్చు. ఈ లోన్ పై వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంటుంది. పసిడి లోన్ కింద గరిష్టంగా రూ.50 లక్షల వరకు ఆదాయం పొందొచ్చు.

ఈ ఆఫర్ గతం లో కేవలం రూ.20 లక్షలు మాత్రమే ఉండేది. కానీ ఇది ఇప్పుడు రెట్టింపు అయింది. ఇందులో గోల్డ్ లోన్ రూ.20 వేల నుంచి పొందవచ్చు. పైగా గోల్డ్ లోన్స్ పై తక్కువ వడ్డీ రేటు అని చెప్పొచ్చు. అలానే గోల్డ్ లోన్ పై ప్రాసెసింగ్ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఈ లోన్ ని 18 సంవత్సరాల వయసున్న వారు కూడా పొందొచ్చు. రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటివి సబ్మిట్ చెయ్యాల్సి ఉంటుంది. జాయింట్ అకౌంట్ ఉన్నవారు కూడా ఈ గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. ఇన్ కమ్ ప్రూఫ్ వంటివి అవసరం లేకుండా క్షణాల్లో గోల్డ్ లోన్ పొందవచ్చు.