రూ. 41 ఆదా చేస్తే రూ.63 లక్షలు పొందొచ్చు..!

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మంచి అవకాశాన్ని ఇస్తోంది. ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీ తీసుకుంటే భారీగా రిటర్న్స్ పొందే అవకాశం ఉంది. పూర్తి వివరాల లోకి వెళితే.. ఇది ఇన్‌కమ్ ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ పాలసీలో రూ.41 చొప్పున పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయం లో రూ.63 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు.

LIC
LIC

 

ఇది ఇలా ఉంటే జీవన్ ఉమాంగ్ పాలసీ 90 రోజుల వయస్సు నుంచి 55 ఏళ్ల వయస్సు లోపు ఉన్నవారు తీసుకొచ్చు. తల్లిదండ్రులు వారి పిల్లల కోసం దీనిని తీసుకొచ్చు. ఈ పాలసీ కోసం కనీసం సమ్ అష్యూర్డ్ రూ.2,00,000 ఉండాలి. మాక్సిమం లిమిట్ ఏమి లేదు. 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లు, 30 ఏళ్ల టర్మ్స్ ఎంచుకోవచ్చు.

25 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.5,00,000 సమ్ అష్యూర్డ్, 75 ఏళ్ల పాలసీ టర్మ్‌తో జీవన్ ఉమాంగ్ పాలసీ తీసుకుంటే 30 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 75 ఏళ్ల వరకు పాలసీ వర్తిస్తుంది. 30 ఏళ్లపాటు ప్రతీ ఏటా రూ.14,758 ప్రీమియం చెల్లించాలి.

అంటే రోజు రూ.41 చొప్పున పే చెయ్యాలి. 30 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. అంటే అతని వయస్సు 55 వచ్చే వరకు ప్రీమియం చెల్లించాలి. అతనికి 75 ఏళ్ల వయస్సు వచ్చే సరికి గరిష్టంగా రూ.63,08,250 రిటర్న్స్ వస్తాయి. ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీహోల్డర్లు లోన్ కూడా తీసుకోవచ్చు. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాతే లోన్ లభిస్తుంది.