బ్రేకింగ్‌ : మూడు రాజధానుల రద్దు బిల్లును ప్రవేశ పెట్టిన బుగ్గన

మూడు రాజధానులపై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఇవాళ హై కోర్టు కు కూడా ఏపీ ప్రభుత్వం తరఫు… న్యాయవాది స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే… తాజాగా మూడు రాజధానుల రద్దు బిల్లును ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్‌ ప్రవేశ పెట్టారు.

అలాగే… సీఆర్‌డీఏ ఉప సంహరణ బిల్లు, అభివృద్ది వికేంద్రీకరణ బిల్లును ప్రవేశ పెట్టారు మంత్రి బుగ్గన. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలిని శివరామ కృష్ణన్‌ కమిటీ సూచిందని ఈ సందర్భంగా బుగ్గన పేర్కొన్నారు. అమరావతి ప్రాంతం సారవంతమైన, ఖరీదైన భూమి అని పేర్కొన్నారు. దాన్ని వృధా చేయవద్దని కమిటీ స్పష్టంగా చెప్పిందన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పిడినప్పుడు కేంద్రమే హైదరాబాద్‌ లో సంస్థలు పెట్టిందన్నారు. అధికార వికేంద్రీకరణను సమర్థిస్తూ బుగ్గన ప్రసంగం సాగింది.