వాటే పాలసీ…. రూ.1300 తో నలభై లక్షలు..!

మీరు ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీరు తప్పకుండ ఇవి తెలుసుకోవాలి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ రకాల పాలసీలని ఇస్తోంది. వీటి వలన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే వీటిలో చాలా ఆప్షన్లు కూడా వున్నాయి. అలానే పాలసీల్లో కూడా రకాలు వున్నాయి. వాటిలో జీవన్ ఉమాంగ్ అనే పాలసీ కూడా వుంది. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే..

 

LIC
LIC

ఈ పాలసీ తో చాలా బెనిఫిట్స్ వున్నాయి. 55 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ పాలసీని పొందొచ్చు. అలానే లైఫ్ కవరేజ్‌ ని పొందొచ్చు. దానితో పాటు మెచ్యూరిటీ సమయంలో పాలసీ డబ్బులు వస్తాయి. ఇది ఎండోమెంట్ ప్లాన్. ఇది ఇలా ఉంటే పాలసీదారుడు కనుక మరణిస్తే అప్పుడు ఆ డబ్బులు నామినీకి ఇస్తారు. 100 ఏళ్ల వరకు పాలసీ కవరేజ్ ని కూడా పొందొచ్చు. 30 ఏళ్ల వయసులో ఉన్న వారు రూ.5 లక్షలకు బీమా మొత్తానికి 30 ఏళ్ల ప్రీమియం టర్మ్‌తో పాలసీ తీసుకుంటే… అప్పుడు నెలకు రూ.1280 ప్రీమియం పడుతుంది.

మీరు 15, 20, 25 ఏళ్ల టర్మ్‌తో అయినా పాలసీ తీసుకోచ్చు. 30 ఏళ్లు ప్రీమియం చెల్లించి ఉంటే మీకు 60 ఏళ్లు వచ్చి ఉంటాయి. ఇప్పుడు మీకు ప్రతి ఏడాది రూ.40 వేలు వస్తాయి. ప్రతీ నెలా కూడా 99 ఏళ్ల వరకు మీకు ఇలానే డబ్బులు మీకు వస్తాయి. అలానే 100 పడిన తర్వాత బోనస్, ఎఫ్ఏబీ, బీమా మొత్తం అన్నీ కలిపి మెచ్యూరిటీ పొందొచ్చు. బోనస్ రూ.17.6 లక్షలు, ఎఫ్ఏబీ రూ.17.7 లక్షలు, బీమా మొత్తం రూ.5 లక్షలు మొత్తంగా రూ.40 లక్షల వరకు మీరు పొందొచ్చు.