కెసిఆర్ పెద్ద అవినీతి పరుడు.. దుబాయ్ లో పెద్ద బంగ్లాలు కొన్నాడు : రాములమ్మ

ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద అవినీతి పరుడని.. దుబాయిలో కోట్ల రూపాయలతో ఇండ్లు కొంటున్నారని నిప్పులు చెరిగారు విజయశాంతి. వేలాది మంది రైతులు చస్తుంటే ని కుటుంబానికి పదవులు పంచుతున్నాడని…కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు దండుకున్నాడని నిప్పులు చెరిగారు. 30 వ తేదీన దేవుడికి దండం పెట్టి ఈటెల ను గెలిపిద్దామని…పిలుపునిచ్చారు విజయశాంతి. కమలా పూర్ లో ఎన్నికల ప్రచారంలో ఇవాళ విజయశాంతి పాల్గొన్నారు.

ప్రాజెక్టుల పేరుతో ఊర్లకు, ఊర్లు నేలమట్టం చేసి కాంట్రక్టర్ల తో లక్షలు దండుకున్నారని.. దళితబంధు ఎన్నికల తరువాత కూడా రాదన్నారు. కేసీఆర్ ని నమ్మితే ఆయన ఉచ్చులో పడ్డట్టేనని.. హైదరాబాద్ లో వరదలకు కొట్టుకుపోయిన ఇండ్లకు 10000 ఇస్తా అన్నారు,ఇప్పుడు ఏమైంది ? అని ప్రశ్నించారు. బతుకమ్మ చీరల పేరుతో కనీసం నాణ్యత లేని చీరలు ఇస్తున్నారని.. ఆడపడుచులకు అన్యాయం చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు.

అసలు 7 సంవత్సరాల కాలంలో ఎం చేశారు మీరు.అసలు ముఖ్యమంత్రి గా ఉండటానికి సిగ్గు ఉందా ? ముఖ్యమంత్రి పదవి ఎడమకాలితో సమానం అన్నావ్ మరి దిగిపో అంటూ ఫైర్ అయ్యారు విజయశాంతి. ఢిల్లీలో చేసిన సర్వేలో చెత్త ముఖ్యమంత్రి, పనికి రాని ముఖ్యమంత్రి అన్నారని కెసిఆర్ కు చురకలు అంటించారు. ఉద్యమకారులనే మోసం చేసిన వ్యక్తి ఇవ్వాళ తెలంగాణ ప్రజలను మోసం చేయడం ఒక లెక్కా.? అని మండిపడ్డారు. కేసీఆర్ పాలసీ ఒకటే మద్యం ఇచ్చి ,పైసలు ఇస్తాడు,మందుతో పడుకోపెట్టి మోసం చేస్తున్నాడన్నారు. కేసీఆర్ ని పూర్తిగా గద్దె దింపాలని… యావత్ తెలంగాణ ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.