కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉపాధి కల్పించడం కోసం ఎన్నో విధాలుగా ఎన్నో పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సరికొత్త పథకాలను అమలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం మరొక పథకం ద్వారా ప్రజల ముందుకు వచ్చింది అయితే ఈ పథకం ఎప్పటినుంచో అమలులో ఉన్నప్పటికీ ప్రజలలోకి సరైన విధంగా వెళ్లలేదని చెప్పాలి.
కేంద్ర ప్రభుత్వం గతంలో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ పథకాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లడంలో అధికారుల విఫలమయ్యారు. దీంతో ఈ పథకాన్ని విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళ్లి వారికి ఉపాధి హామీని కల్పించాలని జీవనోపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే పథకం అనేది సుమారు పది సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఎవరికి పెద్దగా అవగాహన లేదు ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయానికి వస్తే…
ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 50 లక్షల వరకు సబ్సిడీ రూపంలో ఇవ్వనుంది. ఈ పథకాన్ని కేంద్రంలోని పశు సంవర్ధక, కోళ్లఫారాల శాఖ నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా పెద్ద ఎత్తున కోడిగుడ్లు, మాంసం, పాల ఉత్పత్తులను పెంచడమే ధ్యేయంగా ఈ పథకాన్ని నిర్వహిస్తుంది. ఈ పథకం కింద లబ్ది పొందేవారికి కేంద్రం స్కిల్ ట్రైనింగ్ ఇస్తుంది. అలాగే కొత్త టెక్నాలజీని ఎలా ఉపయోగించాలో కూడా శిక్షణను అందజేస్తున్నారు.
ఇక ఈ పథకం ద్వారా ఎవరైతే కోళ్ల, మేకలు పందుల పెంపకం వంటి పరిశ్రమలను ప్రారంభిస్తారో అలాంటి వారికి సబ్సిడీ రూపంలో డబ్బును చెల్లించనుంది. ఈ పథకం ద్వారా సుమారు 50 లక్షల వరకు సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వం అందించనుంది .అయితే మనం ఎలాంటి పెంపకం ప్రారంభిస్తున్నాము అనే దాన్నిబట్టి మనకు డబ్బును అందజేస్తారు.
కోళ్ల పరిశ్రమకు రూ.25 లక్షలు, గొర్రెల పరిశ్రమకు రూ.50 లక్షలు, మేకల పరిశ్రమకు రూ.50లక్షలు, పందుల పరిశ్రమకు రూ.30 లక్షలు, దాణా తయారీ పరిశ్రమకు రూ.50 లక్షలను కేంద్రం ఇస్తుంది. ఇక ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారికి కేంద్రం ఇచ్చే సగం సబ్సిడీ మనీ పోగా మరికొంత బ్యాంకుల నుంచి కూడా రుణాలను పొందవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ఒకేసారి ఈ డబ్బును అందించకుండా వాయిదాల పద్ధతిలో అందజేస్తుంది.