లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలని అందిస్తూనే వుంది. వీటి వలన చాలా మందికి ఎంతో ప్రయోజనం ఉంటోంది. అనేక రకాల బీమా సంస్థలు వచ్చినా కూడా LIC లో ఇంకా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అన్ని వర్గాల వారికీ కూడా అందుబాటులో LIC పలు పథకాలను ప్రవేశ పెడుతోంది. మహిళల కోసం మరో ప్రత్యేకమైన ప్లాన్ ని తెచ్చింది. అదే ఎల్ఐసీ ఆధార్ షిలా. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసేద్దాం..
పొదుపుతో పాటు బీమా ప్రయోజనాలు ని కూడా దీని ద్వారా ఉంటాయి. దీర్ఘకాలంలో అధిక సంపదను దీనితో పొందవచ్చు. ఇది ఎండోమెంట్ ప్లాన్. పాలసీ యాక్టివ్ లో ఉండగా పాలసీదారుడు మరణించిన సందర్భంలో కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఒకవేళ పాలసీ వ్యవధిలో జీవించి ఉంటే మెచ్యూరిటీ ప్రయోజనాలను పొందుతారు.
లోన్ సౌకర్యం, మోటారు బీమాను ఉండడంతో లిక్విడిటీ అవసరాలను అందిస్తుంది. ఇది లాయల్టీ జోడింపులను కూడా అందిస్తుంది. పాలసీ విలువ ఆధారంగా రుణ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. 8 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న మహిళలందరికీ ఈ పాలసీ తీసుకునే అర్హత వుంది. 10 నుంచి 20 సంవత్సరాల మధ్య కాల వ్యవధిలో మెచ్యూర్ అవుతుంది. ఈ పాలసీకి గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 70 సంవత్సరాలు.
15 ఏళ్ల వయస్సు నుంచి 25 ఏళ్ల దాకా రోజుకు రూ. 87 పెట్టుబడి పెడితే రూ. 31,755
పడడానికి పూర్తి సంవత్సరం పడుతుంది. ఇంకో పదేళ్లపాటు స్థిరంగా ఇన్వెస్ట్ చేస్తే రూ. 3,17,550 డిపాజిట్ చేసినట్టు. అప్పుడు మీకు 70 ఏళ్లు కి మెచ్యూర్ అవుతుంది. సుమారు రూ. 11 లక్షల మొత్తం ఇలా ఈ స్కీముతో పొందవచ్చు.