పోలీస్ కానిస్టేబుళ్ల అభ్యర్థులకు అలర్ట్. పోలీస్ కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల చేసారు హోం మంత్రి అనిత. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఫలితాలు విడుదల చేశారు హోం మంత్రి అనిత.

ఇందులో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఉన్నతాధికారులు ఉన్నారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ ( https://slprb.ap.gov.in/ ) లో ఈ వివరాలు అందుబాటులో ఉంటాయి. ఈ పరీక్ష ఫలితాలలో గండి నానాజీ 168 మార్కులతో మొదటి స్థానంలో నిలిచారు. రమ్య మాధురి రెండో స్థానంలో ఉండగా అచ్యుతారావు మూడో స్థానంలో నిలిచారు.
పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్
https://slprb.ap.gov.in/UI/index