లోన్ తీసుకోవాలని అనుకునే వారికి ఎల్‌ఐసీ గుడ్ న్యూస్..!

-

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. లోన్ తీసుకోవాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. దేశీ ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటైన ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సొంతింటి కల సాకారం చేసుకోవాలని అనుకునే వారు లోన్ తీసుకోచ్చు. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కామన్ సర్వీస్ సెంటర్లతో పార్టనర్ షిప్ ని కుదుర్చుకుంది.

LIC

కనుక లోన్ పొందాలనుకొనేవారు విలేజ్ లెవెల్ ఎంట్రప్రెన్యూర్ల ద్వారా లోన్ పొందవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, కామన్ సర్వీస్ సెంటర్ భాగస్వామ్యంలో భాగంగా కస్టమర్లు హోమ్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్, టాప్ అప్ లోన్స్ వంటివి తీసుకోచ్చు. ఈ లోన్ ని పొందాలి అంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, అడ్రస్ ప్రూఫ్ అవసరం అవుతాయి.

అదే విధంగా ఇన్‌కమ్ డాక్యుమెంట్లు కూడా అవసరం అవుతాయి. కేవలం 6.7 శాతం వడ్డీ రేటు తో రుణాలను ఇస్తోంది. సిబిల్ స్కోర్ బాగున్న వారికే తక్కువ వడ్డీకి రుణాలు వస్తున్నాయి. మీ లోన్ వడ్డీ రేట్లను క్రెడిట్ స్కోర్ ప్రభావితం చేస్తుంది.

కామన్ సర్వీస్ సెంటర్ పాన్ ఇండియా నెట్‌వర్క్ ద్వారా చాలా ప్రాంతాలకు విస్తరించేందుకు అవకాశం ఉందని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాస్ ఎండీ చెప్పారు. కస్టమర్లకు సులభంగా వేగంగా లోన్ అందించడం వీలవుతుంది అని అన్నారు. లాంగ్ టర్మ్‌లో బిజినెస్ పెరుగుదలకు ఈ భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

దేశవ్యాప్తంగా 4 లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్లు వున్నాయి. అయితే వీటిని కేంద్రం ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా ఏర్పాటు చేసింది. పబ్లిక్ యుటిలిటీ సర్వీసులు, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు వంటి సేవలని అందిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version