రూ.230 పొదుపుతో రూ.17 లక్షలు!

-

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఎన్నో రకాల స్కీమ్స్ ని కస్టమర్స్ కి ఇస్తోంది. వీటి వలన కస్టమర్స్ కి ఎన్నో లాభాలు కలుగుతాయి. లోన్ మొదలు ఎన్నో లాభాలని LIC ఇస్తోంది. అదే విధంగా మెచ్యూరిటీ తర్వాత ఒకేసారి భారీ మొత్తం పొందొచ్చు. అలాగే కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. అయితే అన్ని పాలసీలు ఒకేలా వుండవు. ఎంచుకునే పాలసీ బట్టి లాభాలు ఉంటాయి.

 

LIC
LIC

అయితే ఎల్‌ఐసీ అందించే స్కీమ్స్‌ లో జీవన్ లాభ్ కూడా ఒకటి. దీని వలన కూడా కస్టమర్స్ చక్కటి లాభాలని పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ స్కీమ్ వల్ల ప్రాఫిట్, ప్రొటెక్షన్ రెండూ లభిస్తాయి. 8 నుంచి 59 ఏళ్ల వరకు వయసులో ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ 16 నుంచి 25 ఏళ్ల వరకు ఉంటుంది. అయితే ఇన్వెస్ట్ చెయ్యడానికి గరిష్ట పరిమితి లేదు.

కనీసం రూ.2 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలి. అలానే మూడేళ్ల తర్వాత లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. చెల్లించిన ప్రీమియం మొత్తం పై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే.. నామినీ లేదా కుటుంబ సభ్యులకు పాలసీ డబ్బులు చెల్లిస్తారు. 20 ఏళ్ల వయసులో ఉన్న వారు 16 ఏళ్ల టర్మ్‌తో రూ.10 లక్షల బీమాకి పాలసీ తీసుకుంటే నెలకు రూ.7 వేల వరకు ప్రీమియం చెల్లించాలి. అంటే రోజుకు రూ.230 ఆదా చెయ్యాలి. పదేళ్లు ప్రీమియం కట్టాలి. మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ.17 లక్షలకు పైగా వస్తాయ్.

Read more RELATED
Recommended to you

Latest news