చిన్న మొత్తంలో ఇన్వస్ట్‌ చేస్తే స్కీమ్స్‌ కోసం చూస్తున్నారా.. ? ఇది బెస్ట్‌ ఆప్షన్‌

-

డబ్బులు పొదుపు చేయాలని సంపాదించే ప్రతి వ్యక్తి అనుకుంటాడు. అనుకోవడం కాదు చేయాలి కూడా. చిన్నమొత్తంలో పొదుపు చేయడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా చిన్న అమౌంట్‌ సేవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ల కోసం బోలెడన్నీ స్కీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వారికి ఒక రకమైన ఆప్షన్, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి మరో రకమైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంది.

ప్రతి నెలా రూ. 1000 నుంచి డబ్బులు పొదుపు చేసుకున్నా కూడా దీర్ఘకాలంలో భారీ మొత్తం పొందొచ్చు. ఎలానో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గృహిణులకు ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు అనువుగా ఉంటాయి. తక్కువ మొత్తంతోనే భారీ డబ్బులు సొంతం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అందిస్తోంది. దీన్ని మనం పీపీఎఫ్ అని కూడా పిలుచుకుంటాం. పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో ఈ పథకం అందుబాటులో ఉంది. మీరు ఇందులో చేరొచ్చు. ప్రతి నెలా చిన్న మొత్తంతో ఈ స్కీమ్‌లో డబ్బులు దాచుకోవచ్చు.

ఉదాహరణకు మీరు పీపీఫ్ అకౌంట్ తెరిస్తే మీకు 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ రేటు మూడు నెలలకు ఒకసారి మారుతుంది. లేదంటే స్థిరంగా కూడా ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ సహా ఇతర స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటును సమీక్షిస్తుంది. పీపీఎఫ్ ఖాతాలో ఏటా రూ. 1.5 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. అవసరం అనుకుంటే ఐదేళ్ల చొప్పున ఈ పథకం మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. ఇలా ఎక్కువ కాలం డబ్బులు దాచుకోవచ్చు.

ఉదాహరణకు మీరు పీపీఎఫ్‌లో నెలకు రూ. 1000 పొదుపు చేయలని అనుకున్నారు. ఇలా 15 ఏళ్ల పాటు డబ్బులు పెట్టాలి. అంటే ఏడాదికి రూ. 12 వేలు డిపాజిట్ చేసినట్లు అవుతుంది. ఇలా 15 ఏళ్లలో రూ.1.8 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు. మెచ్యూరిటీ సమయంలో చేతికి ఒకేసారి రూ.3.25 లక్షలు వస్తాయి.

రిస్క్‌ ఉన్నా పర్వాలేదనుకుంటే..

అదే మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా నెలకు రూ.1000 మొత్తాన్ని సిప్ చేస్తూ రావొచ్చు. దీర్ఘకాలంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రాబడి ఎక్కువగా ఉంటుంది. సగటున 12 శాతం రాబడి లభిస్తుందని తెలియజేస్తున్నారు. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా నెలకు రూ. 1000 పెడుతున్నారని అనుకుందాం. 15 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే రూ.1.8 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది. 12 శాతం రాబడి ప్రకారం చూస్తే.. మెచ్యూరిటీ సమయంలో రూ.5.04 లక్షలు వస్తాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news