కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలకు సహాయాన్ని అందించడానికి ఎన్నో అభివృద్ధి పథకాలను తీసుకువస్తూ ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ రంగానికి కూడా చేయూతని అందించడానికి ఎన్నో పథకాలను తీసుకురావడం జరిగింది. వీటి ద్వారా రైతులు ఎన్నో ఉపయోగాలను పొందుతూ ఉంటారు. వాటిలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కూడా ఒకటి. ఈ పథకం ద్వారా రైతులకు పంటకు సంబంధించి బీమాను అందిస్తోంది. ముఖ్యంగా రైతులు నివారించలేని ప్రకృతి వైపరీత్యాల నుండి పంటకు సంబంధించిన నష్టాలను తగ్గించే విధంగా ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా వేసవికాలంలో పంటలను ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. ఎండలు ఎక్కువగా ఉండటం వలన పండ్లు, పూలు వంటి పంటలు పై నష్టం ఎక్కువగా వస్తుంది. అందువలన ఇటువంటి పంటలకు బీమాను అందిస్తోంది.
అర్హత వివరాలు:
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అధికారికంగా ప్రకటించిన పంటలకు మరియు వాటికి సంబంధించి సాగు చేస్తున్న రైతులు అర్హులు మరియు కౌలు రైతులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా అధికారికంగా ప్రకటించిన ప్రాంతాలలో మాత్రమే ఈ పథకం కవరేజీ ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు కేవలం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గడువులో మాత్రమే చేయాల్సి ఉంటుంది మరియు మీ ప్రాంతం, పంటకు సంబంధించిన వివరాల ప్రకారం ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పథకానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ కి వెళ్లి స్వయంగా పంటల బీమా ఆప్షన్ ను క్లిక్ చేయాలి. దీని తర్వాత ఫోన్ నెంబర్ తో లాగిన్ చేసి ఓటిపి ను అందజేయాలి. తరువాత రైతు వివరాలు, బ్యాంక్ పాస్ బుక్ వివరాలు వంటి మొదలైనవి అందజేయాలి. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత బీమా చేయించుకోవాల్సి ఉంటుంది మరియు దీనికి సంబంధించిన ప్రీమియం 90% కాకపోతే దానిని ప్రభుత్వం భరిస్తుంది. ఈ పథకాన్ని కేవలం భారత వ్యవసాయ బీమా సంస్థ మాత్రమే కాకుండా ఇతర ప్రైవేటు బీమా కంపెనీలు కూడా ప్రారంభించాయి. ఈ విధంగా దరఖాస్తు చేసుకుని బీమా తీసుకుంటే ఎలాంటి విపత్తులు ఎదురైనా దానికి సంబంధించిన పరిహారాన్ని పొందవచ్చు మరియు నష్టపోయిన పంటలకు సంబంధించి బీమా డబ్బులు బీమా సంస్థ అందిస్తుంది.