ఈరోజుల్లో చాలా మంది వాళ్లకి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. పోస్ట్ ఆఫీస్ కూడా ఎన్నో స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. మీరు ఏదైనా మంచి పథకంలో పెట్టుబడి పెట్టాలని చూస్తుంటే.. ఈ స్కీము గురించి చూడాలి. అధిక రాబడితో పాటు భద్రత కూడా ఉండాలని అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. పోస్ట్ ఆఫీసు ఎన్నో పథకాలలు అందిస్తోంది. మంచిగా రాబడిని అందిస్తాయి. పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ కూడా మంచి స్కీమ్. అధిక వడ్డీని పోస్ట్ ఆఫీస్ ఇస్తోంది.
ఈ స్కీము లో కనుక మీరు డబ్బులు పెట్టారంటే, పదేళ్లలో రెండింతల ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పథకంలో మీకు వడ్డీ రేటు ఐదేళ్ల కాల వ్యవధిపై ఓపెన్ చేసే ఖాతాపై 7.5 శాతంగా ఉంది. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల కాలపరిమితితో ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టవచ్చు. ఒక్కో టెర్మ్ కి ఒక్కో రకమైన వడ్డీ రేటు. ఐదేళ్లు కాల వ్యవధితో ఎక్కువ వడ్డీ వస్తుంది.
పదేళ్ల వ్యవధితో డిపాజిట్ చేస్తే రెండింతల కన్నా ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. ప్రస్తుతం 7.5శాతం వడ్డీ ని పొందవచ్చు. ఒకవేళ రూ. 5 లక్షలను పోస్ట్ ఆఫీసులో ఈ పథకం కింద డిపాజిట్ చేస్తే ఐదేళ్లలో మీకు రూ. 2,24, 974 అవుతుంది. మొత్తం రూ. 7,24,974 అవుతుంది. దీన్ని ఇంకో ఐదేళ్లు కొనసాగిస్తే మెచ్యూరిటీ సమయానికి రూ. 10,51,175 అవుతుంది.