భద్రాచలం బిల్డింగు కూలిన సంఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. నిన్నటి రోజున కామేశ్వరరావు అనే వ్యక్తి మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ వెలికి తీసింది. ఈరోజు తెల్లవారుజామున మరో మృతదేహం లభ్యమయింది. మృతుడి పేరు ఉపేందర్ గా అధికారులు గుర్తించారు.
అతని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఇక ఉపేందర్ మృతదేహం కూడా లభ్యం కావడంతో ఆపరేషన్ ముగిసిందని అధికారులు ప్రకటించారు. కాగా ఈ సంఘటనలో ఏడుగురు మరణించినట్లు మొదట్లో అధికారులు ప్రకటన చేశారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.