తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలు మృతి చెందారు. నిన్న రాత్రి తెలియని విషపదార్థం తినడంతో ముగ్గురు పిల్లలు మృతి చెందినట్టు సమాచారం అందుతోంది.
అటు అపస్మారక స్థితిలోకి తల్లి వెళ్ళింది. చెన్నయ్య, రజిత దంపతులకు చెందిన పిల్లలు సాయికృష్ణ(12), మధుప్రియ(10), గౌతమ్(8) ఉన్నారు. ఇక ఆ ముగ్గురు పిల్లలు మృతి చెందారు. ఈ సఙ్గహతన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
https://twitter.com/bigtvtelugu/status/1905437732668932486