SBI schemes : దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం అనేక సేవలను అందిస్తోంది. ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి కోరుకునే వారికి బ్యాంకు ఫిక్స్ డిపాజిట్లు సరైన ఎంపిక. ప్రస్తుతం డిపాజిట్లను పెంచడానికి బ్యాంకులు కూడా అధిక వడ్డీ రేట్లను కల్పిస్తున్నాయి. అమృత్ కలష్ పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ పథకాన్ని తీసుకువచ్చింది. సీనియర్ సిటిజన్ల కోసం స్పెషల్ వడ్డీ రేట్లతో వీకేర్ FD స్కీమ్ ని అందిస్తోంది. ఈ రెండు పథకాలు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 30 వరకే అమృత్ కలష్ స్కీంలో ఇన్వెస్ట్ చేయడానికి అవుతుంది.
అమృత్ కలష్ స్కీములో ఎంత వస్తాయి..?
ఈ స్కీము మెచ్యూరిటీ టెన్యూర్ 400 రోజులు. జనరల్ కస్టమర్ కి 7.10% సీనియర్ సిటిజెన్స్ కి 7.60 శాతం వడ్డీ వస్తుంది. లక్ష రూపాయలు జమ చేసినట్లయితే మెచ్యూరిటీ అయిన తర్వాత చేతికి అసలు వడ్డీ కలిపి రూ. 1,07,800 వస్తాయి. సీనియర్ సిటిజెన్స్ కి 7.60 శాతంతో మెచ్యూరిటీ తర్వాత రూ. 1,08,350 వస్తుంది.
వీకేర్ FD స్కీములో ఎంత వస్తాయి..?
ఇక వీకేర్ FD స్కీమ్ విషయానికి వస్తే.. ఈ స్కీమ్ లో చేరడానికి సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 100 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు కల్పిస్తోంది. మెచ్యూరిటీ పీరియడ్ ఐదు నుంచి 15 ఏళ్లుగా ఉంది. ఇందులో 7.50% వడ్డీ వస్తుంది. పదేళ్ల కాలానికి లక్ష డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత రూ. 1,74,450 వస్తాయి