దేశవ్యాప్తంగా 5 రోజుల పాటు పాస్‌పోర్ట్‌ సేవలు బంద్‌ !

-

Online Passport Portal Shut For 5 Days, All Appointments To Be Rescheduled: పాస్‌పోర్ట్‌ తీసుకునే వారికి బిగ్‌ అలర్ట్. దేశవ్యాప్తంగా ఐదు రోజుల పాటు పాస్‌పోర్ట్‌ సేవలు బంద్‌ కానున్నాయి. సాఫ్ట్‌వేర్‌ మెయింటెనెన్స్‌ కోసం పాస్‌పోర్ట్‌ సర్వీసులకు విరామం ప్రకటించారు అధికారులు.

Online Passport Portal Shut For 5 Days, All Appointments To Be Rescheduled

పాస్‌పోర్ట్ దరఖాస్తుల కోసం ఆన్‌లైన్ పోర్టల్ సాఫ్ట్‌వేర్‌ మెయింటెనెన్స్‌ కోసం వచ్చే ఐదు రోజుల పాటు మూసివేయబడుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ వ్యవధిలో కొత్త అపాయింట్‌మెంట్‌లు ఏవీ షెడ్యూల్ చేయబడవని తెలిపింది. ముందుగా బుక్ చేసిన అపాయింట్‌మెంట్‌లు రీషెడ్యూల్ చేయబడతాయని ప్రకటించారు అధికారులు.

అంటే… 29 ఆగస్ట్ 2024, గురువారం 20:00 గం IST నుండి 2 సెప్టెంబర్, సోమవారం 06:00 గంటల వరకు పాస్‌పోర్ట్‌ సేవలు బంద్‌ పనిచేయవు అన్న మాట. 30 ఆగస్ట్ 2024 కోసం ఇప్పటికే బుక్ చేసిన అపాయింట్‌మెంట్‌లు తగిన విధంగా రీషెడ్యూల్ చేయబడతాయి. అని పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌లో ఒక ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version