ఒక ద‌గ్గ‌ర పెరిగి! ఒక ద‌గ్గ‌ర త‌గ్గి! షాక్ ఇస్తున్న బంగారం ధ‌ర‌లు

న‌వంబ‌ర్ 6 శ‌ని వారం రోజు బంగారం ధ‌ర‌లు షాక్ ఇస్తున్నాయి. ఒక న‌గరంలో త‌గ్గి మ‌రొక న‌గ‌రంలో పెరుగుతున్నాయి. శుక్ర వారం రోజు దేశ వ్యాప్తంగా నిల‌క‌డ‌గా ఉన్న బంగారం ధ‌ర‌లు ఈ రోజు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు కేరళ, ఢిల్లీ వంటి ప్ర‌ధాన‌ నగరాల్లో 10 గ్రాముల బంగారం పై రూ.190 నుంచి రూ.250 వరకు పెరిగింది.

ఇత‌ర న‌గ‌రాల్లో రూ. 190 నుంచి రూ. 250 వరకు తగ్గాయి. మ‌న తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ లో శుక్ర వారం 22 క్యారెట్ ల 10 గ్రాముల‌ బంగారం ధ‌ర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760గా ఉంది. అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్ లోని విజ‌య వాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760గా ఉంది. అలాగే మ‌న దేశం లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు చూద్దం.

 

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,110గా వ‌ద్ద కొన‌సాగుతుంది.

ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.46,220 ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.47,220 వ‌ద్ద కొన‌సాగుతుంది.

కోల్‌కతా న‌గంర‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.49,250 ఉంది.

బెంగళూరు న‌ర‌గం లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉంది. దీంతో పాటు 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.48,760 వ‌ద్ద కొన‌సాగుతుంది.