స్టేజీపైనే పెద్దిరెడ్డి కాళ్ళు పట్టుకున్న వైసీపీ ఎంపీ.. వీడియో వైరల్ !

కుప్పం రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. మున్సిపల్ ఎన్నికల కారణంగా వైఎస్ఆర్ సీపీ మరియు టిడిపి పార్టీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్సెస్ చంద్రబాబునాయుడు కుప్పం లో పొలిటికల్ హీట్ నడుస్తోంది. ఈటీవీ లకు కమ్మ పర్యటించిన చంద్రబాబు నాయుడు… టిడిపి క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నాయకుల పై తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు.

అయితే ఇది ఇలా ఉండగా… నిన్న వైసీపీ పార్టీ నిర్వహించిన ఎన్నికల సభలో ఓ అరుదైన సంఘటన బయటపడింది. మంత్రి పెద్దిరెడ్డి… ఈ ఎన్నికల సభకు హాజరయ్యారు. అయితే… పెద్దిరెడ్డి సభ స్టేజి పైకి వచ్చే సమయంలో… చిత్తూరు పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప… ఆయన కాళ్లపై పడి పోయారు. భయం తో నో లేదా… గౌరవం తోనూ కానీ… మొత్తానికి స్టేజీపైనే పెద్దిరెడ్డి కాళ్లను మోక్కారు ఎంపీ రెడ్డప్ప. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ సంఘటన చూసిన… అక్కడివారు షాక్ కు గురయ్యారు. స్టేజ్ పైనే కాళ్ళు మొక్కడం వెంటనే ఆశ్చర్యానికి గురయ్యారు.