సూపర్‌మార్కెట్‌లో రిఫ్రిజెరేటర్లలో పెట్టిన ప్రొడెక్ట్స్‌ కొనకూడదా…??

-

టెక్నాలజీ ఎంత పెరుగుతుందో.. మనిషి ఆరోగ్యం అంత క్షీణిస్తుంది. ఫ్రిడ్జిలు రాకముందు ఎప్పటికప్పుడు వండుకుని తినేది..మిగిలింది కుక్కలకు వేయడమే మహా అయితే ఆరోజు సాయంత్రం వరకు తినడమో ఉండేది.. అంతేకానీ నెలల తరబడి దాచుకునే కాన్సప్ట్‌ ఉండేది కాదు.. కానీ ఇప్పుడు ఏళ్ల తరబడి కూడా ఫ్రిడ్జ్‌లో ఆహార పదార్థాలు నిల్వ ఉంటున్నాయి. అయితే సూపర్‌ మార్కెట్లో మీరు చూసే ఉంటారు..రిఫ్రిజెరేటర్లో పెట్టి చాలా ప్రొడెక్ట్స్‌ ఉంటాయి. మనం కూడా వాటిని తీసుకుంటాం. కానీ అవి కొనకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు.. ముఖ్యంగా ఇవి అస్సలు తీసుకోవద్దట..

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలు ఏడాది పొడవునా సూపర్ మార్కెట్లో లభిస్తూనే ఉంటాయి. అయితే వీటిని వాటి సీజన్లో మాత్రమే కొనాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఇవి పోరస్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇవి నీటితో నిండి ఉంటాయి. వీటిని ఫ్రిజ్లో పెట్టడం వల్ల ఘనీభవిస్తాయి. ఆ ప్రక్రియలో లోపలి పోషకాలు పోతాయి…ఇది వాటిని రుచిని నాశనం చేస్తుంది. అదనపు ద్రవాన్ని అందులో నింపుతుంది. అలాంటివి తినడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.

బ్రకోలి

ఆకుపచ్చని కూరగాయ బ్రకోలి. దీన్ని సాధరణ కూరగాయల్లా బయటపెట్టి అమ్మవచ్చు. కానీ రిఫ్రిజెరేటర్లలోనే పెడతారు. కారణం వాటి ఖరీదు ఎక్కువ. అందరూ కొనరు. అవి అమ్ముడయ్యే దాకా, వాటి జీవిత కాలం పెంచేందుకు రిఫ్రిజరేటర్లలో పెడతారు. వీటిని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల రుచి ఉండదు. పోషక విలువలు కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా ఇలా ఎక్కువ కాలం పాలూ ఫ్రి‌జ్‌లో పెట్టిన బ్రకోలీని తినడం వల్ల చిన్న చిన్న గడ్డల్లాంటివి ఏర్పడే అవకాశం ఉంది.

పుట్టగొడుగులు

పుట్టగొడుగులు బయట పెట్టి అమ్మేవే కొనుక్కోవాలి. సంతల్లో బయటపెట్టే అమ్ముతారు. కానీ సూపర్ మార్కెట్లో మాత్రం ఫ్రోజెన్ ఫుడ్‌గా మార్చేస్తారు. ఆ పుట్టగొడుగులను కొనకూడదు. ఎందుకంటే ఫ్రిజ్లో ఎక్కువ కాలం పెట్టిన పుట్టగొడుగులు చూడటానికి తాజాగా కనిపిస్తాయి. కానీ వాటిని వండే ముందు బయటపెడితే కాసేపటికే మెత్తగా మారిపోతాయి. వండినా కూడా రుచి ఉండవు.

కొత్తిమీర, పుదీనా

వీటి గురించి మనకు బాగా తెలుసు.. అయితే వీటిని కూడా ఫ్రిజ్లలో పెడుతున్నారు. ముఖ్యంగా వీటి ఆకులను తరిగి డబ్బాల్లో వేసి ఫ్రిజ్ల్ లలో పెట్టి అమ్ముతున్నారు. వాటిని కొనుక్కుంటే కత్తిరించే పనిలేకుండా నేరుగా వాడేయచ్చని మనం అనుకుంటాం. కానీ అవి ఫ్రిజ్లో గడ్డకట్టి రుచిని, పోషకాలను కోల్పోతాయి. వాటిని తిన్నా తినకపోయినా ఒక్కటే. ఇంట్లో కూడా నార్మల్ ఫ్రిజ్లో పెట్టాలి కానీ, డీప్ ఫ్రిజ్‌లో పెట్టకూడదు.

నగ్గెట్లు, ప్యాటీలు

వెజ్ నగ్గెట్లు, బర్గర్ ప్యాటీలు, పిజ్జా బేస్‌లు ఫ్రిజ్లో నిల్వ చేసినవి కొనకూడదు. వీటిని ఫ్రిజ్లో పెట్టడం వల్ల ఇందులో ఉండే పిండి పదార్థాలు, ఎమల్సిఫైయర్లు విపరీత ఫలితాలను ఇస్తాయి. ఓవర్ ఫ్రీజింగ్ చేయడం వల్ల రుచి కూడా బాగోదు. వీటిని వేయించుకుని తినడం వల్ల మరింతగా ట్రాన్స్ ఫ్యాట్లు శరీరంలో చేరిపోతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version