స్టేట్ బ్యాంక్ గుడ్ న్యూస్… ఇకపై ఈజీగా లోన్స్..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలని ఇస్తుంది. వీటి వలన కస్టమర్స్ కి మంచిగా బెనిఫిట్స్ కలుగుతాయి. తాజాగా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కీలక నిర్ణయం తీసుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

SBI
SBI

కో-లెండింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది స్టేట్ బ్యాంక్. యూగ్రో క్యాపిటల్ సంస్థ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అయితే దీనితో భాగంగా ఎంఎస్ఎంఈలకు సులభంగా లోన్స్ రానున్నాయి. ఈ కొత్త భాగస్వామ్యంలో భాగంగా ఎస్‌బీఐ, యూ గ్రో 2022 మార్చి నాటికి రూ.500 కోట్ల రుణ మంజూరును లక్ష్యంగా భావిస్తున్నారు.

ఎస్బీఐ కో లెండింగ్ ఆపర్చునిటీస్ కోసం పలు ఎన్‌బీఎఫ్‌సీలతో పార్టనర్ షిప్ ని కుదుర్చుకుంటోంది. ఇది ఇలా ఉంటే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI సవరించిన కో-లెండింగ్ నిబంధనలకు అనుగుణంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలియజేసారు.

హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్/ఎఫ్ఎంసీజీ, హాస్పిటాలిటీ, ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్, ఆటో కాంపొనెంట్స్, లైట్ ఇంజినీరింగ్ మొదలైన 8 ఎస్ఎంఈ రంగాలకు స్టేట్ బ్యాంక్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news