వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ( పిల్) దాఖలు అయింది. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్, జె.శంకర్ వ్యాజ్యం దాఖలు చేశారు. ఐఏఎస్‌లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ను ఆమోదించకుండా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈసీ, శాసనమండలి కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. పిల్‌ను లంచ్ మోషన్ స్వీకరించాలని సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి కోరారు. అయితే ఈ పిల్ ను అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఇటీవల సిద్ధిపేట కలెక్టర్ గా ఉన్న వెంకట్రామి రెడ్డి తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన వెంటనే వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఖారారు అయింది. ఈ రాజీనామాపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఫైర్ అవుతున్నాయి. బండి సంజయ్, రెవంత్ రెడ్డి వంటి నేతలు టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా మారారని విమర్శిస్తున్నారు. గతంలో రైతులు వడ్ల వేయద్దని రైతులని, వడ్ల ధాన్యం అమ్మితే చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించడం వివాదాస్పదమైంది.