మహిళా దినోత్సవం నాడు స్టేట్ బ్యాంక్ గుడ్ న్యూస్..!

Join Our Community
follow manalokam on social media

మహిళా దినోత్సవం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతీ ఒక్కరికి సొంతింటి కలని నిజం చేసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చింది. మహిళా దినోత్సవ వేళ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ మహిళలకి అదిరిపోయే న్యూస్ చెప్పింది. హోమ్ లోన్ తీసుకునే మహిళలకు వడ్డీ రేట్లను 5 బేసిక్ పాయింట్లు తగ్గించనున్నట్లు తెలిపింది.

ఇలా చేయడం వలన వారికి 6.70 ప్రారంభ వడ్డీ రేట్ల తో హోమ్ లోన్స్ ఇస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే ఈ ప్రత్యేక ఆఫర్ ని మహిళ దినోత్సవం సందర్భంగా మహిళలకు అందించనున్నట్లు తెలిపింది ఎస్బీఐ. ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించుకోవాలని కోరుతున్నాం అని బ్యాంక్ అంది.

ఇది ఇలా ఉండగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రముఖులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తదితర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అలానే దేశం లో మహిళలు అనేక రంగాల్లో సరి కొత్త రికార్డులు నెలకొల్పారని ట్విట్టర్ ద్వారా తెలిపారు. వివిధ రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాల్ని గుర్తించి వాళ్ళని ప్రశంసించడమే ఈ సారి థీమ్.

 

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...