సుకన్య సమృద్ధి యోజన పథకంతో లాభాలే లాభాలు…!

సుకన్య సమృద్ధి యోజన పథకంతో ఎన్నో ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. ప్రస్తుత కాలంలో పిల్లల చదువులు, పెళ్ళిళ్ళకు కూడా ఈ డబ్బులు పనికొస్తాయి. పైగా భవిష్యత్తు కోసం ప్రతీ ఒక్కరూ కూడా డబ్బులు ముందు గానే పొదుపు చేసుకోవడం కూడా ఎంతో అవసరం. కుమార్తెల విద్య, వివాహ ఖర్చుల కోసం కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇలా దీని వలన ఎన్నో లాభాలు వున్నాయి.

 

money
money

కేంద్ర ప్రభుత్వం మీ కుమార్తెలకు ఉజ్వల భవిష్యత్తు ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఇది అమ్మాయిలకి మాత్రమే. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ వున్నాయి. మరి పూర్తిగా చూసేయండి.

సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు ఇలా వున్నాయి…!

ప్రస్తుత వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. అయితే ఇవి ప్రతి త్రైమాసికం ప్రారంభంలో మారుతూ ఉంటాయి. అకౌంట్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు.

ఓ వ్యక్తి తన కుమార్తెకు ఒక సంవత్సరం వయసున్నప్పుడు ఈ ఎకౌంట్ ఓపెన్ చేసి, ప్రతీ నెలా రూ.12,500 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయం ముగిసే సరికి మొత్తం రూ .63.7 లక్షలు వస్తాయి. అందులో మీరు జమ చేసిన డబ్బులు రూ. 22.5 లక్షలు కాగా, రూ. 41.29 లక్షల వడ్డీ రూపం లో వస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ పధకంలో మొత్తం 15 సంవత్సరాల వరకు పెట్టుబడులు అవసరం. అదే సమయంలో, దీని మెచ్యూరిటీ సమయం 21 సంవత్సరాలు. అలానే దీని వలన రూ .1.5 లక్షల వరకు పెట్టుబడులకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది.