పీపీఎఫ్ అకౌంట్ పై లోన్ ఇలా తీసుకోండి..!

-

ప్రజల కోసం కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు రావడం జరిగింది. అయితే వాటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF కూడా ఒకటి. ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టడం వలన ఎలాంటి రిస్క్ ఉండదు. పైగా మంచిగా రాబడి పొందే అవకాశం కూడా ఉంటుంది. అదే విధంగా ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టడం వలన పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఇది ఇలా వుంటే పీపీఎఫ్ అకౌంట్ కలిగిన వారికి మరో ఫెసిలిటీ కూడా ఉంది. అదే లోన్ సదుపాయం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే…

money
money

పీపీఎఫ్ అకౌంట్ కలిగిన వారికి లోన్ సదుపాయం కూడా ఉంటుంది. మీరు మీ యొక్క పీపీఎఫ్ అకౌంట్‌ పై లోన్ కూడా తీసుకోవచ్చు. అయితే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. వీటిని కనుక మీరు ఫాలో అయ్యారు అంటే పీపీఎఫ్ ఖాతాపై రుణం తీసుకోవడంకి వీలవుతుంది. మీరు పీపీఎఫ్ ఖాతా తెరిచిన దగ్గరి నుంచి 3-6 ఏళ్ల మధ్య కాలం లో లోన్ తీసుకోవచ్చు.

ఇది షార్ట్ టర్మ్ లోన్స్. అంటే తీసుకున్న రుణాన్ని 36 నెలల లోగా మళ్లీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేటు అయితే 1 శాతంగా ఉంటుంది. 36 నెలల లోపు తిరిగి కట్టేస్తే ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. లేదంటే 6 శాతం వడ్డీ పడుతుంది గమనించింది. మీ పీపీఎఫ్ ఖాతాలో జమ అయిన డబ్బుల్లో 25 శాతం వరకు మొత్తాన్ని లోన్ కింద తీసుకొచ్చు. లోన్ కోసం అప్లై చెయ్యాలంటే ఫామ్ డి ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. పోస్టాఫీస్ లేదా బ్యాంక్ ఎక్కడైతే ఖాతా ఓపెన్ చేసారో అక్కడే లోన్ ని కూడా పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news