పీపీఎఫ్ ఖాతాలో రూ.1000 జమ చేస్తే.. రూ.26 లక్షలు.. ఎలా వస్తాయో తెలుసా..?

-

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పెట్టుబడి పెడితే సురక్షితమైనదిగా ఖాతాదారులు భావిస్తారు. అధిక వడ్డీ చెల్లింపు పథకాల్లో పీపీఎఫ్ కూడా ఒకటి. ఖాతాదారుడు పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టినట్లయితే ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. అయితే తాజాగా పీపీఎఫ్ అకౌంట్ గురించి ఆర్థిక నిపుణులు మరిన్నీ వివరాలను వెల్లడించారు. పీపీఎప్ ఖాతాలో నెలకు రూ.1000 జమచేస్తే.. చివరకు రూ.లక్షల్లో ఆదాయం వస్తుందని తెలిపారు. ఖాతాదారులు ఇందులో పెట్టుబడి పెడితే భవిష్యత్‌లో పెద్దమొత్తంలో డబ్బును ఆర్జించవచ్చు. అయితే నెలకు రూ.1000 డిపాజిట్ చేయడం ద్వారా రూ.26 లక్షల భారీ మొత్తాన్ని ఎలా సంపాదించాలో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం.

పీపీఎఫ్-డబ్బులు
పీపీఎఫ్-డబ్బులు

పీపీఎఫ్‌లో మొదటి పెట్టుబడి కాలపరిమితి 15 సంవత్సరాలు. ఇప్పుడు మీరు 15 నెలలపాటు ప్రతినెలా రూ.1000 జమచేశారు అనుకోండి.. చివరికి రూ.1.80 లక్షలు అవుతుంది. దీనికి వడ్డీరేటు 7.1 ఉంటుంది కాబట్టి.. వడ్డీయే రూ.1.45 లక్షలు వస్తాయి. 15 ఏళ్ల తర్వాత మొత్తంగా 3.25 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. అయితే 15 ఏళ్ల తర్వాత కాలపరిమితి ముగిసినా.. మరో ఐదేళ్లపాటు ఈ స్కీంను కొనసాగించుకోవచ్చు. అలా మీరు మరో ఐదు నెలలపాటు నెలకు రూ.1000 జమ చేయాలి. చివరకు మీకు రూ.5.32 లక్షలు వస్తాయి. ఆ తర్వాత కూడా మీరు ఐదేళ్ల పెంచుకుంటే మొత్తంగా 8.24 లక్షలు వస్తాయి. ఇంకా మీరు మరో ఐదేళ్లపాటు ఈ స్కీంను కొనసాగించుకోవాలని భావిస్తే.. ఆ మొత్తం రూ.12.36 లక్షలు అవుతుంది. దీంతో 30 సంవత్సరాలను రూ.12.36 లక్షలు వస్తాయి.

30 సంవత్సరాల తర్వాత పీపీఐ ఖాతాదారుడు మరో 5 ఏళ్ల పాటు స్కీంను కొనసాగించాలని అనుకుంటే.. మీరు నెలకు రూ.1000 జమ చేయాల్సి ఉంటుంది. అలా 35 సంవత్సరాలకు రూ.18.15 లక్షలు వస్తాయి. మరో ఐదేళ్లపాటు ఈ స్కీంను కొనసాగిస్తే.. 40 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత రూ.26.32 లక్షలు పొందవచ్చు. 20 ఏళ్ల వయసులో ఉద్యోగంలో జాయిన్ అయిన వారు నెలకు రూ.1000 జమ చేస్తే పదవీ విరమణ వయసు నాటికి రూ.26 లక్షలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news