పండగ వచ్చింది అంటే చాలు అందరూ సొంత ఊళ్లకు వెళ్ళాలి అనుకుంటారు. దీనితో చాలా మంది రైలు ప్రయాణానికే మొగ్గు చూపిస్తూ ఉంటారు. దీనితో నెలలు ముందుగానే బుకింగ్స్ చేసుకుంటారు కొందరు. కాని దొరకని వాళ్ళు మాత్రం తత్కాల్ లో టికెట్ చేసుకుంటారు.
అత్యవసరంగా రైలు ప్రయాణం చేసే వారిని ఇది ఆదుకుంటుంది. నిర్ణీత సమయం అనేది టికెట్ బుకింగ్ కి ఉంటుంది. తత్కాల్ బుకింగ్ రైలు బయల్దేరడానికి ముందు రోజు ఓపెన్ చేస్తారు. ఏసీ క్లాస్‌కు ఉదయం 10 గంటలకు, నాన్-ఏసీ క్లాస్‌కు ఉదయం 11 గంటలకు విండో ఓపెన్ చేస్తారు.
తత్కాల్ టికెట్ కోసం సెకండ్ క్లాస్ టికెట్‌కు బేసిక్ ఫేర్ పైన 10 శాతం, ఇతర క్లాసులకు బేసిక్ ఫేర్ పైన 30 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా తత్కాల్ టికెట్లు క్షణాల్లో ఖాళీ అయిపోతాయి కాబట్టి అప్రమత్తంగా ఉండి బుక్ చెయ్యాలి.
మీ ఐఆర్‌సీటీసీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయిన తర్వాత ‘Book Your Ticket’ పేజీలో మీ ప్రయాణ వివరాలు ఎంటర్ చేయగానే తర్వాతి పేజీలో రైళ్ల వివరాలు ఉంటాయి.
మీరు బుక్ చేయాలనుకున్న ట్రైన్ పైన క్లిక్ చేసి క్లాస్ ఎంచుకుని తత్కాల్ టికెట్ కోసం కోటా ఆప్షన్‌లో ‘Tatkal’ పైన క్లిక్ చెయ్యాల్సి ఉంటుంది. చివరగా ‘Book Now’ బటన్ పైన చేసి ప్రయాణికుల వివరాలు ఎంటర్ చెయ్యాలి.
టికెట్ బుకింగ్ సమయంలో ‘Consider for Auto Upgradation’ ఎంచుకుంటే ఆటోమెటిక్ క్లాస్ అప్‌గ్రేడేషన్ వర్తిస్తుంది. అంటే మీరు ఎంచుకున్న క్లాస్ కన్నా పై క్లాస్‌లో సీట్లు ఖాళీగా ఉంటే టికెట్లు బుక్ అయిపోతాయి.
ప్యాసింజర్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి Next బటన్ పైన క్లిక్ చేసి… అన్ని వివరాలు ఓసారి సరిచూసుకొని బుకింగ్ కొనసాగించాలి. తర్వాత క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్ ద్వారా నగదు చెల్లించాలి.
తత్కాల్ ఇ-టికెట్‌లో ఒక పీఎన్ఆర్‌కు గరిష్టంగా నలుగురు ప్రయాణికుల్ని మాత్రమే అనుమతించగా… తత్కాల్ కోటాలో ఎలాంటి కన్సెషన్స్ వర్తించవు.
మీ ప్రయాణానికి తేదీ ఫిక్స్ చేసుకోకపోతే ‘Flexible with Date’ ఆప్షన్ ఎంచుకునే సదుపాయం కూడా ఉంది.
సెకండ్ క్లాస్ టికెట్‌కు బేసిక్ ఫేర్ పైన 10 శాతం అదనంగా, మిగతా క్లాసులకు బేసిక్ ఫేర్ పైన 30 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.