తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు 2019 విడుద‌ల‌కు సిద్ధం..

-

నిన్న ఏప్రిల్ 12న ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో తెలంగాణ ఇంటర్ ఫలితాలు కూడా ఏప్రిల్ 12న లేదంటే 13 న విడుదలవుతాయంటూ వార్తలు వచ్చాయి. అయితే.. వీటిపై కూడా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు వస్తున్నాయి. ఇదివరకు ఏప్రిల్ 8 నే ఇంటర్ ఫలితాలు విడుదలవుతాయంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే.. దీనిపై స్పందించిన ఇంటర్ బోర్డు ఇంటర్ ఫలితాలపై బోర్డు ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదని తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే ఏ పుకార్లను నమ్మొద్దని తెలిపింది. ఫలితాలపై బోర్డు నుంచి విడుదలయ్యే ప్రకటననే నమ్మాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించింది.

There is no official note on telangana inter results

అయితే… నిన్న ఏప్రిల్ 12న ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో తెలంగాణ ఇంటర్ ఫలితాలు కూడా ఏప్రిల్ 12న లేదంటే 13 న విడుదలవుతాయంటూ వార్తలు వచ్చాయి. అయితే.. వీటిపై కూడా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బోర్డు నుంచి అయితే.. ఇప్పటి వరకు తెలంగాణ ఇంటర్ ఫలితాలపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి.. ఫలితాలపై సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మకండి.

Read more RELATED
Recommended to you

Latest news