ఇక ఈ వారంతో పెళ్లి ముహుర్తాలు ముగిసిపోయినట్టే…!

-

కొత్త సంవత్సరం వచ్చేసింది. ఇక న్యూ ఇయర్ అంటే ప్రతీ ఒక్కరు ఏదో ఒక రెసొల్యూషన్ పెట్టుకుంటారు. చాలా మంది అయితే ఈ సంవత్సరం లో పెళ్లి చేసేసుకుందాం అని ఫిక్స్ అయిపోతారు. అయితే మరి పెళ్లి ముహుర్తాలు ఎలా ఉన్నాయి..? ఈ ఏడాది లో ఎప్పుడు పెళ్లి చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. ఇలా అనేక విషయాల గురించి మీ కోసం..

ఈ నెల లో మాత్రం 8వ తేదీ వరకే పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉన్నాయని, ఇంకా చెప్పాలంటే 7వ తేదీనే చివరి మంచి ముహూర్తమంటూ సిద్ధాంతులు చెబుతున్నారు. ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు తక్కువేనని పండితులు అంటున్నారు. గురు మౌఢ్యమితో పాటు శుక్ర మౌఢ్యమి సైతం వెనువెంటనే రావడంతో ముహుర్తాలు తక్కవ వచ్చాయని పండితులంటున్నారు. జనవరి దాటితే మే నెల వరకూ మంచి ముహూర్తాలు లేవని తెలియజేసారు. ఇది అయ్యాక మళ్లీ మే లోనే ప్రారంభం కానుంది. ఈ నెల 14న నుండి ఫిబ్రవరి 12 దాకా శూన్యమాసం కనుక శుభముహూర్తాలు అనేవేవీ ఉండవని అంటున్నారు.

అలానే సుమారు నెల రోజుల పాటు గురు మౌఢ్యమి ఉంటుందని తెలిపారు. ఇది ఇలా ఉండగా ఫిబ్రవరి 14 మాఘ శుద్ధ తదియ నుంచి మే 4వ తేదీ బహుళ అష్టమి వరకూ అంటే 80 రోజుల పాటు శుక్ర మాఢ్యమి ఉంటుందని సిద్ధాంతులు చెబుతున్నారు. నెక్స్ట్ 10 రోజులు పాటు శుభదినాలు ఉన్న బలమైన ముహూర్తాలు లేవుట. అయితే మొత్తానికి మే 14 నుంచి బలమైన ముహూర్తాలు ఉంటాయని పేర్కొంటున్నారు. గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి ఇలా రెండు వరుసగా కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news