ఐఆర్‌సీటీసీ గోవా టూర్ ప్యాకేజీ.. వివరాలివే..!

-

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC వివిధ ప్రాంతాలకి టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. అయితే తాజాగా గోవాకి కూడా టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. ఇక ఈ టూర్ ప్యాకేజీ గురించి పూర్తిగా చూసేస్తే.. హైదరాబాద్ నుంచి పలు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది IRCTC. హైదరాబాద్ నుంచి గోవాకు టూర్ ప్యాకేజీ రూపొందించింది. గోవా డిలైట్ పేరుతో ఈ ప్యాకేజీ అందిస్తోంది.

ఐఆర్‌సీటీసీ గోవా డిలైట్ టూర్ ప్యాకేజీ 2021 సెప్టెంబర్ 24న ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ 27న ముగుస్తుంది.సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఉంటుంది.
ఇది మొత్తం 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ. ఫ్లైట్‌లో గోవా వెళ్లి అక్కడి పర్యాటక ప్రాంతాలను చూసి తిరిగి ఫ్లైట్‌లోనే హైదరాబాద్ రావొచ్చు.

ఈ టూర్ లో భాగంగా సౌత్ గోవా సైట్ సీయింగ్ ఉంటుంది. ఓల్డ్ గోవా చర్చ్, బసిలికా ఆఫ్ బామ్ జీసెస్, ఆర్కియలాజికల్ మ్యూజియం, పోర్ట్‌రైట్ గ్యాలరీ, వ్యాక్స్ వాల్డ్ మ్యూజియం, శ్రీ మంగేషీ ఆలయం, మిరామర్ బీచ్ సందర్శించొచ్చు. అలానే మండోవీ నదిపై బోట్ క్రూజ్ చూడచ్చు. అలానే ఫోర్ట్ అగ్వాడా, కండోలిమ్ బీచ్, బాగా బీచ్, అంజునా బీచ్, వాగేటర్ బీచ్, చపోరా ఫోర్ట్ చూడచ్చు.

ఇలా ఈ టూర్ లో భాగంగా ఈ ప్రదేశాలని అన్ని చుట్టేయచ్చు. గోవా డిలైట్ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.15,780. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.15,960, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.20,945 చెల్లించాలి. వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, రివర్ బోట్ క్రూజ్ వంటి వాటికీ సొంతగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి టూర్ ప్యాకేజీ కిందకి రావు.

Read more RELATED
Recommended to you

Latest news