నిరుద్యోగులకు ఇస్రో గుడ్‌న్యూస్‌!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఉద్యోగ నియామకాలు చేపట్టింది. లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ (ఎల్‌పీఎస్‌సీ) ఇస్రోలో ఉంది. తిరువనంతపురంలో ఒకటి, మరొకటి బెంగుళూర్‌లో ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 8 ఖాళీలను భర్తీ చేయనుంది. ఎంపికైన వారికి అనుభవం ఆధారంగా రూ.63,000 జీతం అందించనున్నారు.

job
job

ఈ ఉద్యోగ నియామక ప్రక్రియ ఆ«ధారంగా తిరువనంతరపురం, బెంగళూరు విభాగాల్లో ఎల్‌పీఎస్‌సీలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

వయస్సు– పలు పోస్టులకు 35 ఏళ్లు గరిష్ట పరిమితి ఉంది.. కొన్ని పోస్టులకు 25 ఏళ్ల గరిష్ట వయో పరిమితి ఉంది.

హెవీ వెహికల్‌ డ్రైవర్‌ – 5 ఏళ్ల హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ అనుభవంతో పాటు పది లేదా ఇంటర్‌ పాసై ఉండాలి.

లైట్‌ వెహికల్‌ డ్రైవర్‌ – 5 సంవత్సరాలు లైట్‌ వెహికల్‌ డ్రైవర్‌ అనుభవంతోపాటు పది లేద ఇంటర్‌ పాసై ఉండాలి.
ఇందులో కుక్‌ ఉద్యోగానికి – పది లేదా ఇంటర్‌ పాసై 5 ఏళ్ల అనుభవం ఉండాలి.
ఫైర్‌మెన్‌ – 10 పాసై ఉండాలి. సంస్థ ఫిట్‌నెస్‌ పరీక్షలో పాస్‌ అవ్వాలి.
అటెండెంట్‌ – పది పాసై ఉండాలి.

దరఖాస్తు విధానం..

దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు 2021 ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్‌ 6 వరకు ఎల్‌సీపెస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.