ఐఆర్‌సీటీసీ అదిరే టూర్… మేఘాలయని చుట్టేయచ్చు..!

ఐఆర్‌సీటీసీ ఇప్పటికే ఎన్నో టూర్ ప్యాకేజీలని తీసుకు వచ్చింది. వీటి ద్వారా మనం ఈజీగా చూడాలనుకున్న ప్రదేశాలని చూసి వచ్చేయచ్చు. ట్రైన్, ఫ్లైట్స్ మీదుగా కూడా టూర్స్ వున్నాయి. కనుక ఇలా మీకు నచ్చిన టూర్‌కు వెళ్లొచ్చు. ఇక ఈ మేఘాలయ టూర్ గురించి పూర్తి వివరాలలోకి వెళ్ళిపోతే..

 

irctc meghalaya tourism

తాజాగా ఐఆర్‌సీటీసీ ఓ కొత్త టూర్ ప్యాకేజ్ ని స్టార్ట్ చెయ్యడం జరిగింది. దీనిలో భాగంగా మేఘాలయ చూడొచ్చు. అది కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పైన. నిజంగా ఎంత బాగుంటుందో కదా..? సినిమాటిక్ రేంజ్ లో ఈ ప్యాకేజీ వుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకుంటే ఎంతగానో ఎంజాయ్ చెయ్యచ్చు. ఇది ఇలా ఉంటే ఐఆర్‌సీటీసీ మేఘాలయ టూర్ నవంబర్ 13న ప్రారంభమౌతుంది. వారం రోజులు టూర్ ఉంటుంది. అయితే ఈ టూర్ గువాహటిలో స్టార్ట్ అవుతుంది.

గువాహటికి వెళ్ళాక రైల్వే స్టేషన్ లేదా ఎయిర్‌పోర్ట్ నుంచి మిమ్మల్ని పికప్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ మీకు టూర్ పూర్తి వివరాలు తెలియజేస్తారు. అదే విధంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ టూర్ లో భాగంగా మీరు షిల్లాంగ్, చిరపుంజి, షాంగ్‌డెంగ్ సహా పలు ప్రాంతాలను చుట్టేసి రావొచ్చు. ఇక ధర విషయానికి వస్తే.. టూర్ ప్యాకేజ్ ధర రూ.38,320 నుంచి ప్రారంభమౌతంది. కేవలం 10 సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ టూర్ కోసం బుక్ చేసుకోవాలంటే ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో బుక్ చేసుకోచ్చు. ఫుడ్, పెట్రోల్, హోటల్ ఖర్చు ఇలా అన్నీ ఐఆర్‌సీటీసీనే భరిస్తుంది.