IRCTC : హైదరాబాద్ నుండి గంగా యాత్ర ప్యాకేజీ.. వివరాలివే..!

-

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఇప్పటికే ఎన్నో టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇన్నాళ్లూ యాత్రలకు వెళ్లలేని పర్యాటకుల కోసం టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. హైదరాబాద్ నుంచి గంగా గయ యాత్ర టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఇక ఈ టూర్ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలలోకి వెళితే..

 

Ganga Yatra Package

2021 సెప్టెంబర్ 22న ఈ టూర్ మొదలవుతుంది. 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఐఆర్‌సీటీసీ గంగా గయ యాత్ర టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.24,660. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.25,450, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.30,020 చెల్లించాలి.ఈ టూర్ సెప్టెంబర్ 22 ఉదయం 6.25 గంటలకు హైదరాబాద్‌లో స్టార్ట్ అవుతుంది. ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 1.30 గంటలకు గయ చేరుకుంటారు.

చెకిన్ అయిన తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత మహాబోధి ఆలయం, పరిసర ప్రాంతాల్లోని బౌద్ధ ఆలయాలు చెకిన్ అయిన తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత మహాబోధి ఆలయం, పరిసర ప్రాంతాల్లోని బౌద్ధ ఆలయాలు చూడచ్చు. రెండోరోజు తెల్లవారుజామున విష్ణుపాదం ఆలయానికి వెళ్ళచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత వారణాసికి వెళ్ళాలి. మూడో రోజు కాశీ విశ్వనాథ ఆలయం, విశాలాక్షి ఆలయం, భూ ఆలయం చూడచ్చు. సాయంత్రం గంగా హారతి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. నాలుగో రోజు ఉదయం ప్రయాగ్‌రాజ్ చూసి.. త్రివేణి సంగమం, అలోపి దేవీ ఆలయం, ఆనంద్ భవనం సందర్శించొచ్చు. ఐదో రోజు ఉదయం గంగా స్నానానికి వెళ్లి మధ్యాహ్నం సార్‌నాథ్‌కు బయల్దేరాలి. దమేఖ్ స్తూపాన్ని సందర్శించాలి.

Read more RELATED
Recommended to you

Latest news