IRCTC : తిరుమల చూడాలనుకునే వాళ్ళకి పంచదేవాలయం టూర్ ప్యాకేజ్… వివరాలివే..!

-

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC వివిధ రకాల టూర్ ప్యాకేజీలని తీసుకు వచ్చింది. అయితే ఇప్పుడు పంచదేవాలయం టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే… ఈ టూర్ లో భాగంగా భక్తులు తిరుమల, తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలు సందర్శించొచ్చు.

అలానే ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఇది 1 రోజు, 2 రాత్రుల టూర్ ప్యాకేజీ. ఐఆర్‌సీటీసీ పంచదేవాలయం టూర్ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో బుక్ చేయొచ్చు.

ఇక ధరల విషయంలోకి వస్తే.. ఐఆర్‌సీటీసీ పంచదేవాలయం టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.5,270. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. అలానే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.7,010. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.11,750 చెల్లించాలి. పంచదేవాలయం టూర్ ప్యాకేజీ ప్రతీ రోజూ అందుబాటులో ఉంటుంది. భక్తులు తిరుపతి చేరుకున్నాక ఉదయం 8 గంటలకు టూర్ మొదలవుతుంది. తిరుపతి రైల్వే స్టేషన్‌లో రిసీవ్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు.

అయితే ఉదయం శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాలు సందర్శించొచ్చు. నెక్స్ట్ శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాలని చూడచ్చు. రెండో రోజు ఉదయం 9.30 గంటలకు తిరుమల బయల్దేరాలి. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం ఉంటుంది. అలానే సమయం ఉంటే గోవిందరాజ స్వామి ఆలయాన్ని సందర్శించొచ్చు. సాయంత్రానికి భక్తులను తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర దించేస్తారు. దీనితో ప్యాకేజీ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version