ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలంటే మనాలిని చూడాల్సిందే…!

-

ఎక్కడ చూసిన మంచు కొండలు… అందమైన ప్రకృతి… ఎటు చూసిన అద్భుతమే…! నిజంగా చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఇటువంటి గొప్ప ప్రదేశాన్ని ప్రతీ ఒక్కరు తప్పక చూడాలి.
చలికాలం లోనూ మంచు కొండల వద్దకు వెళ్తే ఆ ఆనందమే వేరు కదా…! నిజంగా మనాలి కనుక వెళ్లారంటే… ఇగ్లూలో స్టే చేస్తే అదిరిపోతుంది. కొత్తగా పెళ్ళైన జంటకి అయితే పర్ఫెక్ట్ హనీమూన్. చాల మంది ఇక్కడ హనీమూన్ కి వెళ్తూ ఉంటారు. కుటుంబ సమేతంగా లేదా ఫ్రెండ్స్ తో మనాలి ట్రిప్ వేసుకుంటే మరిచిపో లేని ట్రిప్ అవుతుంది. ఈ ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలంటే హిమాచల్ ‌ప్రదేశ్‌ లోని మనాలికి వెళ్లాల్సిందే.

ఇక్కడ ఇగ్లూలు ఉంటాయి. ఆ మంచు ఇళ్లలో సరదాగా రెండు మూడు రోజులు గడిపేయొచ్చు. ఇలా కనుక ఉన్నారంటే ఆ క్షణాలని ఎన్నటికి మరచిపోలేరు. అంత అందంగా ఉంటుంది మరి ట్రిప్. మనాలి సిమ్లా నుంచి దాదాపు 260 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి మరో 15 కిలోమీటర్లు వెళ్తే హమ్తా పాస్‌లోని ఇగ్లూ హోస్ట్‌ ప్రాంతానికి చేరుకోవచ్చు. మొట్ట మొదటి సారి మన దేశంలో నిర్మించిన ఇగ్లూల్లో ఉంటూ ఆర్కిటిక్‌ అనుభూతిని పొందొచ్చు. స్కేయింగ్‌, స్నో బోర్డింగ్‌ వంటి వాటితో పాటు రోహతాంగ్‌ పాస్‌, చంద్రఖని పాస్‌, సోలాంగ్‌ లోయ, సుల్తాన్‌పుర ప్యాలెస్‌ వంటి ప్రదేశాలను చూడొచ్చు.

ఇక ఈ ఇగ్లూలు విషయం లోకి వస్తే.. వీటిని 2017లో సేథన్‌ గ్రామానికి చెందిన వికాస్‌ కుమార్‌, తాషీ అనే ఇద్దరు యువకులు ప్రయోగాత్మకంగా నిర్మించారు. ఈ ఇగ్లూలను పర్యాటకుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ముందుగా బుక్ చేసుకోవాలి ఇక్కడ ఉండాలంటే. ఇక్కడ పర్యాటకులు చలిని తట్టుకునేలా జనరేటర్‌ సాయంతో హీటర్లను ఏర్పాటు చేశారు. అలానే ఇగ్లూ లోపల ఎండు గడ్డి, విద్యుత్‌ దీపాలు వగైరా ఏర్పాటు చేశారు. ఇలా అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news