మీ ఓటరు కార్డులో తప్పులు ఉన్నాయా…? అయితే ఇలా సరిచేసుకోండి…!

Join Our Community
follow manalokam on social media

ఓటరు కార్డులో కనుక పేరు, అడ్రస్, ఫోటో తప్పుగా ఉంటె కనుక ఎంతో ఈజీగా సరి చేసుకోవచ్చు. అది కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం మీ ఇళ్ళల్లో నుండే ఈ పని చెయ్యొచ్చు. అయితే ఓటరు కార్డులో తప్పులు ఉంటే ఎలా కరెక్ట్ చెయ్యాలి…? ఈ విషయానికి వస్తే… ఓటర్ కార్డులో తప్పులు ఉంటే వాటిని ఆన్‌లైన్‌లోనే సులభంగానే సరిదిద్దుకోవచ్చు.

కొన్ని కొన్ని సార్లు ఓటరు కార్డులో చిన్న చిన్న తప్పులు ఉంటూ ఉంటాయి. మీరు మీ ఓటర్ కార్డులోని పేరు లేదా అడ్రస్ వంటి వివరాల్లో ఏమైనా తప్పులు ఉన్నట్టైతే ఇలా చెయ్యండి. మొదట మీరు మీరు ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. మీ పేరు, వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా మీరు పేరు, వివరాలతో రిజిస్టర్ చేసుకున్నాక యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. ఈ స్టెప్ అయిపోయాక మీరు మీకు ఎడమ వైపు ‘కరెక్షన్ ఇన్ పర్సనల్ డీటైల్స్’ అని ఓ ఆప్షన్ కనబడుతుంది చూడండి.

ఇది మూడో ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు మీ రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం వంటి వివరాలు సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు పూర్తి చేసుక తప్పులు సరి చేసుకోవచ్చు. పేరు, అడ్రస్, ఫోటో వంటి వాటిని మార్చుకోవచ్చు. మీరు మార్చాలంటే ప్రూఫ్ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి. ఇలా మీకు రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ మీరు దీని స్టేటస్ కూడా చూడొచ్చు.

 

TOP STORIES

బిజినెస్ ఐడియా: మహిళలు ఇంట్లోనే ఇలా సంపాదించవచ్చు..!

చాలా మంది మహిళలు నేటి కాలంలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారు. వాళ్ల కోసమే ఈ బిజినెస్ ఐడియాస్. వీటిని అనుసరిస్తే మీరు ప్రతి నెలా మంచి...