ఓటు వేయాలంటే ప్రతీ ఒక్కరికీ కూడా ఓటర్ ఐడి తప్పనిసరిగా ఉండాలి. ఓటర్ ఐడి కార్డు మీకు లేదా..? అయితే భారత ఎన్నికల సంఘం ఓటర్ ఐడి లేనివారికి ఓటర్ ఐడి కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తుంది. అయితే ఓటర్లు డిజిటల్ ఓటర్ ఐడి కార్డును కూడా పొందొచ్చు.
అయితే ఎలా కార్డుని పొందాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఇలా ఈ ప్రాసెస్ ని కనుక మీరు ఫాలో అయ్యారంటే ఈజీగా మీరు డిజిటల్ ఓటర్ ఐడి ని పొందొచ్చు. అదే విధంగా మీ ఓటర్ కార్డు లో ఏమైనా తప్పులు వున్నా కూడా సరి చేసుకోవచ్చు. మరి ఇక ఆ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం.
దీని కోసం ముందుగా ఎలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://voterportal.eci.gov.in లేదా https://nvsp.in/ లోకి వెళ్లాలి.
ఇప్పుడు మీరు ఎన్‌వీఎస్‌పీ పోర్టల్‌లో మీ అకౌంట్‌లోకి లాగిన్ లేదా రిజిస్టర్ అవ్వండి.
మీకు కనుక ఒకవేళ అకౌంట్ లేదు అంటే అప్పుడు ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకోండి. అలానే ఒక పాస్‌వర్డ్‌ను కూడా మీరు సెట్ చేసుకోండి.
అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో అడిగే మీ వివరాలను నమోదు చేయాలి.
తర్వాత లాగిన్ ఐడీ క్రియేట్ అవుతుంది.
లాగిన్ అయిన తర్వాత ఈపీఐసీ నెంబర్‌ను లేదా ఫామ్ రిఫరెన్స్ నెంబర్‌ను నమోదు చెయ్యండి.
మీ యొక్క రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోండి.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చెయ్యండి.
నెక్స్ట్ ఈ-ఈపీఐసీని డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది.
ఓటర్ ఐడీ పీడీఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ అవుతుంది అంతే.