బెంగాల్ లో పరిస్థితులు కాశ్మీర్ కన్నా దారుణంగా ఉన్నాయి.- బీజేపీ నేత సువేందు అధికారి

-

పశ్చిమ బెంగాల్ లో అధికార త్రుణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంది. తాజాగా బీజేపీనేత, ప్రధాన ప్రతిపక్ష నేత సువేందు అధికారి టీఎంసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ లో పరిస్థితులు కాశ్మీర్ కన్నా దారుణంగా ఉన్నాయంటూ.. సువేందు అధికారి ఆరోపించారు. బెంగాల్ ఎన్నికల తరువాత విపరీతమైన హింస కొనసాగింది. టీఎంసీ కార్యకర్తలు.. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఘర్షణల్లో చాలా మంది మరణించారు. అయితే దాదాపు లక్షమందికి పైగా హిందువులు రాష్ట్రాన్ని వదిలిపెట్టారని సువేందు అధికారి అన్నారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను పెంచి బెంగాల్ జనాభా ముఖచిత్రాన్ని మార్చేందుకు టీఎంసీ ప్రయత్నిస్తోందని ఆరోపించాడు. టీఎంసీ నేత షేక్ సుఫియాన్ ఎన్నికల అనంతరం మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసను దృష్టిలో ఉంచుకుని బీజేపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిశారు. బెంగాల్ లో సీఏపీఎఫ్ బలగాలను మోహరించాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news