యూపీఐ అంటే ఏమిటి? మనీ ఎలా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు

-

సాధారణంగా మనం యూపీఐతో క్షణాల్లో నగదు బదిలీ చేసుకోగలం. దీంతో ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యాప్స్‌కు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో యూపీఐ అంటే ఏంటి? అది ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం..

భారత ప్రభుత్వం చేపట్టిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమం మొదలైన తర్వాత వీటి ట్రాన్సాక్షన్స్‌
బాగా పెరిగిపోయాయి. . దీనివల్ల మనం గంటల తరబడి బ్యాంకులకు వెళ్లి క్యూలో నిల్చోవాల్సిన బాధలు తప్పాయి. మరి ఇంతటి సౌలభ్యాన్ని తెచ్చిన యూపీఐ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? ఈ∙విషయాలను తెలుసుకుందాం. యూపీఐ దీన్నే సంక్షిప్తంగా ‘యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌’ అంటారు. ఇది ఆర్‌బీఐ నియంత్రిత సంస్థ అయిన నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా తక్షణ నగదు బదిలీ కోసం అభివృద్ధి చేశారు. యూపీఐ ఐఎంపీఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పనిచేస్తుంది. ఏవైనా రెండు బ్యాంక్‌ ఖాతాల మధ్య తక్షణ నగదు బదిలీ చేయడానికి యూపీఐ అనుమతిస్తుంది.

  1. యూపీఐ నగదు బదిలీకి బ్యాంక్‌ ఖాతా అవసరమా?
    యూపీఐ అకౌంట్‌ క్రియేట్‌ చేయాలంటే కచ్చితంగా ఏదైనా బ్యాంక్‌లో ఖాతా ఉండాలి.
  2. యూపీఐతో నగదు బదిలీకి ఉన్న ఛానెల్స్‌?
    వర్చువల్‌ ఐడీ లేదా బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌ + ఐఎఫ్‌ఎస్‌సీ లేదా ఆధార్‌ సంఖ్య.. ఈ మూడింటి ద్వారా యూపీఐ నగదు బదిలీలు జరపవచ్చు.
  3. అత్యంత ప్రజాదరణ పొందిన యాప్స్‌ ఏవి?                                                              ఫోన్ పే, పేటీఎం, భీమ్, గూగుల్‌ పే, ఉబెర్, పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ మొదలైనవి ఉన్నాయి
  4. యూపీఐ, ఐఎంపీ మధ్య తేడా ఏంటి?
  • పీర్‌ టు పీర్‌ ఫంక్షనాలిటీ అందిస్తుంది.
  • ఒకే యాప్‌తో వేగంగా నగదు బదిలీ చేయవచ్చు.
  • వ్యాపారి చెల్లింపులను సులభతరం చేస్తుంది.

5. యూపీఐతో రోజుకు ఎంతస నగదు బదిలీ చేయవచ్చు?
ప్రస్తుతం, ఒక రోజులో రూ.1లక్ష వరకు యూపీఐతో లవాదేవీలు చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news