సూపర్‌ మూన్‌ 2021.. ఈ సమయంలో చూడొచ్చు!

చాలా రోజుల తర్వాత సూపర్‌ పింక్‌ మూన్(చైత్ర పౌర్ణమి) దర్శించనున్నాం. పింక్‌ మూన్‌ ఏప్రిల్‌ చివరి సమయంలో ఆకాశంలో కనపించనుందని సమాచారం. కానీ 2021 ఏప్రిల్‌ 26న కనిపించనుందని సమాచారం. ఈ రోజు రాత్రి 11:33 సమయంలో సంపూర్ణంగా కనిపించనుంది. మాములు గ్రహణంలా కాకుండా దీన్ని స్వయంగా కళ్లతో చూడవచ్చు. కాలుష్యం తక్కువగా ఉన్న నగరాల్లో ఈ దృశ్యం చాలా స్పష్టంగా కనిపించనుంది. ఈ సమయంలో చంద్రుడు సాధారణం కంటే 7 శాతం పెద్దగా, మాములు పౌర్ణమి రోజు కంటే 15 శాతం ప్రకాశవంతంగా కనిపించనుంది.

సూపర్‌ పింక్‌ మూన్‌ 2021 అంటే ఏమిటి?

సూపర్‌ మూన్‌ అనేది చైత్ర పౌర్ణమి. ఈ సమయంలో అది దీర్ఘవృత్తాకారంగా తిరిగినపుడు భూమికి దగ్గరగా కనిపిస్తుంది. చంద్రుడు భూమికి దగ్గరగా (356,907 కి.మీ) ఉన్నందున, ఇది చాలా పెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సూపర్‌ పింక్‌ మూన్‌ వాస్తవానికి పింక్‌ కలర్‌ కాదు. ది ఫార్మర్స్‌ అల్మానాక్‌ ప్రకారం, పింక్‌ గ్రౌండ్‌ ఫ్లోక్స్‌ వంటి వసంత రుతువు పువ్వుల వికసించడాన్ని ఇది నిర్ణయిస్తుంది కాబట్టి దీనిని స్థానిక అమెరికన్లు పిలిచారు. దీనికి స్ప్రౌటింగ్‌ గ్రాస్‌ మూన్, ఎగ్‌ మూన్, పాస్చల్‌ మూన్, ఫిష్‌ మూన్‌ వంటి ఇతర పేర్లతో కూడా పిలుస్తారు.

ఈ దృశ్యాన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఫోటో తీయండి..

సూపర్‌ పింక్‌ మూన్‌ 2021 పెద్దగా, ప్రకాశవంతంగా చంద్రుడు కనిపిస్తాడు. కాబట్టి, ఇది మన స్మార్ట్‌ఫోన్ లలో బంధించడం సులువు.

  • సూపర్‌మూన్‌ స్పష్టంగా కనిపించే ప్రదేశం నుంచి తీయాలి.
  • మీ స్మార్ట్‌ఫోన్ లో ఎక్స్‌పోజర్‌ను సర్దుబాటు చేయండి, తద్వారా చిత్రం ఎక్కువగా లైట్‌ అవ్వదు.
  • ట్రైపాడ్‌ను ఉపయోగించడం మంచిది
  • మీ స్మార్ట్‌ఫోన్ లో అత్యధిక రిజల్యూషన్‌ సెట్‌ చేయండి. ఎక్కువగా జూమ్‌ చేయవద్దు
  • చిత్రాలను తీయడానికి మీ స్మార్ట్‌ఫోన్ లో హెచ్‌డీఆర్‌ని ప్రారంభించండి
  • మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను వాడకండి. మంచి ఫోటోను ఎంచుకోవడానికి ఎక్కువ ఫోటోలను తీసుకోండి
  • మెరుగైన చిత్రాల కోసం స్నాప్‌సీడ్, పిక్స్‌ఆర్ట్, ఫోటోషాప్, లైట్‌రూమ్‌ లేదా మరేదైనా ఎడిటింగ్‌ ఆప్షన్‌ను ఉపయోగించండి.